Begin typing your search above and press return to search.

పవన్‌ డైలాగ్‌ చెప్పిన సెహ్వాగ్‌

By:  Tupaki Desk   |   7 Sep 2021 11:30 AM GMT
పవన్‌ డైలాగ్‌ చెప్పిన సెహ్వాగ్‌
X
టాలీవుడ్‌ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నా.. సినిమాలు చేస్తున్నా కూడా ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. సోషల్‌ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. ఆయన డైలాగ్‌ లను అభిమానులు నోటికి చెప్పేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటారు. కొన్ని సార్లు సెలబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్‌ డైలాగ్‌ లు చెప్పి మరింత పాపులర్‌ అవ్వడం.. సోషల్‌ మీడియాలో గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్‌ డైలాగ్ నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అంటూ చెప్పిన డైలాగ్‌ ను చాలా మంది చాలా రకాలుగా చెప్పి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు.

ఇప్పుడు అదే డైలాగ్‌ ను టీమ్ ఇండియా మాజీ క్రికెటర్‌.. ఇప్పటికే కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ డైలాగ్‌ చెప్పాడు. పవన్‌ కళ్యాణ్ ను అనుకరిస్తూ మెడ మీద చేయి వేసి నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అంటూ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా పవన్‌ అభిమానులు ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌ డైలాగ్‌ ను తెగ షేర్‌ లు చేస్తున్నారు. ఒక జాతీయ స్థాయి సెలబ్రెటీ పవన్‌ కళ్యాణ్ డైలాగ్‌ ను చెప్పడం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్‌ స్టార్‌ సెహ్వాగ్‌ నోటి నుండి పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తెలుగు డైలాగ్ ను సెహ్వాగ్ చెప్పడం తెలుగు వారందరికి కూడా గౌరవం అంటూ మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది డైలాగ్‌ ను ఇప్పటికే కొన్ని వందల మంది సెలబ్రెటీలు చెప్పారు. కాని ఇది మాత్రం చాలా స్పెషల్‌ అన్నట్లుగా అభిమానులు మరియు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగు డైలాగ్ లు హిందీ వారు చెప్పడం అంటే చాలా కఠినమైన టాస్క్. దాన్ని ఫోన్‌ లో చూస్తూ సెహ్వాగ్‌ ప్రయత్నించాడు. ఆయన చేప్పిన డైలాగ్‌ బాగుంది అంటూ అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్ నుండి వరుసగా వస్తున్న సినిమాల విషయానికి వస్తే వచ్చే సంక్రాంతికి భీమ్లా నాయక్‌ విడుదలకు సిద్దం అవుతోంది.. ఇక క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకు సిద్దం అంటున్నారు. ఈ రెండు కాకుండా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరోటి పవన్ కమిట్ అయ్యాడు. అవి కూడా సాధ్యం అయినంత త్వరగా ముగించాలని పవన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.