Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ వీక్ లో 'సెహరి'

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:17 AM GMT
వాలెంటైన్స్ వీక్ లో సెహరి
X
హర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన యూత్‌ ఫుల్ అంశాలతో కూడిన క్రేజీ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి''. హీరో హర్ష కనుమల్లి ఈ చిత్రానికి కథ అందించగా.. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని విడుదలకు రెడీ చేస్తున్నారు.

''సెహరి'' చిత్రాన్ని వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు - టీజర్ మరియు అన్ని పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్‌ లో తన నటనతో ఆకట్టుకున్న హర్ష.. 'ఇది చాలా బాగుందిలే' పాటలో తన డ్యాన్స్ స్కిల్స్‌ ను కూడా ప్రదర్శించాడు.

ఇప్పుడు 'సెహరి' రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో, రాబోయే రోజుల్లో జోరుగా ప్రమోషన్స్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేశారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అభినవ్ గోమఠం - ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ - బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన 'సెహరి' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.