Begin typing your search above and press return to search.
అలరిస్తున్న వర్జిన్ స్టార్ 'సెహరి' టీజర్..!
By: Tupaki Desk | 16 April 2021 10:55 AM ISTహర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి'. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ విడుదల చేసిన 'సెహరి' ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక బాలయ్య యువ హీరో హర్ష ని 'వర్జిన్ స్టార్' గా సంభోదించడం.. టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోని కూడా ఇదే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేయడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే వ్యూహాత్మకంగా ఈ టీజర్ స్టార్టింగ్ లో బాలయ్య ప్రసంగాన్ని జతచేశారు.
'సెహరి' టీజర్ చూస్తుంటే.. తన ప్రేయసితో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న వరుణ్(హర్ష్ కనుమిల్లి).. కోపంతో అతని జీవితంలో నెక్స్ట్ స్టేజీలోకి వెళ్ళడానికి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటాడు. అయితే తన కాబోయే భార్య అక్క అయిన సిమ్రాన్ చౌదరితో పరిచయం ఏర్పడిన తర్వాత అతనిది రైట్ ఛాయిస్ కాదని గ్రహిస్తాడు. ఈ నేపథ్యంలో వరుణ్ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు.. అతని లవ్ లైఫ్ కు ఎలా ఎండ్ కార్డ్ పడిందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇందులో 'మొన్న ఒక పిల్లతో ఓకే అన్నావ్.. ఇప్పుడు మరో గంటలో పెళ్లి పెట్టుకొని పెళ్లికూతురు అక్కతో.. నువ్వేమన్నా ఇమ్రాన్ హష్మి అనుకుంటున్నవా?' అంటూ వచ్చే డైలాగ్ అలరిస్తోంది.
ఇందులో హర్ష్ కనుమిల్లి కామిక్ టైమింగ్ ప్రధాన అంశాల్లో ఒకటని చెప్పవచ్చు. గంగాసాగర్ ద్వారకా సెహారీని యూత్ ని ఆకట్టుకునే అంశాలతో రోమ్-కామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీనికి ప్రశాంత్ ఆర్ విహారీ యొక్క నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అభినవ్ గోమఠం - ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ - సంగీత దర్శకుడు కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరీ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు.