Begin typing your search above and press return to search.

సీటిమార్ టైటిల్ ట్రాక్: ఆకట్టుకునే సాహిత్యం సంగీతం!

By:  Tupaki Desk   |   3 March 2021 6:30 AM GMT
సీటిమార్ టైటిల్ ట్రాక్: ఆకట్టుకునే సాహిత్యం సంగీతం!
X
టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా సీటిమార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కాబోతుంది. క్రీడా నేపథ్యంలో రూపొందిన సీటిమార్.. కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుంది. ఇటీవలే సీటిమార్ టీజర్ తో ఆకట్టుకున్న మేకర్స్.. తాజాగా సీటిమార్ టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో సీటిమార్ టైటిల్ ట్రాక్ మారుమోగుతుంది. ఈ పాటలో కొంతమంది ఆడపిల్లలకు కబడ్డీ కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. గోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాలలో చిత్రీకరించబడిన ఈ పాట ఎనర్జిటిక్ మ్యూజిక్ తో పాటు ఆకట్టుకునే సాహిత్యం కూడా అందించారు లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్.

అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం కలిసి ఆలపించిన ఈ పవర్ ఫుల్ సాంగ్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఇన్స్పైర్ చేసే విధంగా ఉందని చెప్పాలి. విజువల్స్ కూడా అందంగా ఉన్నాయి. గోపీచంద్ తన కోచ్ పాత్రలో ఒదిగిపోయాడు. సీటిమార్ టైటిల్ ట్రాక్ ఓ స్ఫూర్తినింపే సాంగ్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. గోపీచంద్ - సంపత్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇదివరకు వీరి కాంబినేషన్ లో 'గౌతమ్ నంద' సినిమా వచ్చింది. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ జ్వాలారెడ్డి పాత్రలో నటిస్తోంది. అదీగాక ఈ సినిమాలో గోపీచంద్ తో పాటు తమన్నా కూడా కబడ్డీ కోచ్ గా కనిపించనుంది. అయితే సంపత్ నంది సినిమాలలో క్లాస్ అంశాలతో పాటు మాస్ మసాలా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సీటిమార్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్నప్పటికీ సంపత్ మార్క్ పాటలు, మాస్ అంశాలు ఉంటాయని సమాచారం. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.