Begin typing your search above and press return to search.
#2020 మిల్కీ బ్యూటీ వరుస ప్రయోగాలు
By: Tupaki Desk | 18 March 2020 9:55 AM ISTఒకప్పుడు సినిమానే ప్రధాన వినోద మాధ్యమంగా భావించేవాళ్లం. సాంకేతిక విప్లవంతో వినోదం అరచేతి స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలో డిజిటల్ కి.. అందులో భాగంగా వెబ్ సిరీస్ లకు డిమాండ్ అసాధారణంగా పెరుగుతోంది. వాటికి ఇప్పుడు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. దీంతో సినీ ప్రముఖులు సైతం ఆ దిశగా అడుగులు వేస్తుండడం కొత్త మలుపు అనే చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. దీంతో స్టార్ హీరోయిన్లు కూడా ఆయా సిరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అగ్ర నటి సమంత ఇప్పటికే `ది ఫ్యామిలీ మ్యాన్` అనే వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో నటించింది. మరో వైపు కాజల్ కూడా ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యింది. మరికొందరు ఆ బాటలో వెళ్తున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్.. మిల్కీ బ్యూటీ తమన్నా సైతం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవల తమిళం లో ఓ వెబ్ సిరీస్ కథ విని ఇంప్రెస్ అయ్యిందట. దీంతో అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇది మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో.. తండ్రి- కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉండటం.. ఈ సిరీస్ నిడివి కూడా ఎక్కువగా ఉండటంతో వెంటనే తమన్నా ఓకే చెప్పిందట. తనలోని కొత్త కోణాన్ని వెబ్ సిరీస్ ల ద్వారా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తోందట. అంతేకాదు సినిమాలు చేస్తూ ఇక్కడా ఉంటా.. వెబ్ సిరీస్ లతో అక్కడా ఉంటానని చెబుతోంది. ఇదిలా ఉంటే మిల్కీ నటించే వెబ్ సిరీస్ కి రామ సుబ్రమణ్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. వికటన్ సంస్థ నిర్మిస్తోంది.
ఇక ఇటీవల మహేష్ `సరిలేరు నీకెవ్వరు`లో ఓ పాటలో మెరిసిన తమన్నా ప్రస్తుతం తెలుగులో `సీటీమార్'లో నటిస్తుంది. గోపీచంద్ హీరోగా.. సంపత్ నంది దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో ఆంధ్రా మహిళా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్.. తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. దీంతో పాటు హిందీలో `బోల్ చుడియన్`లో నటిస్తూ తమన్నా బిజీగా ఉంది. మరో వైపు `క్వీన్` రీమేక్ `దట్ ఈజ్ మహాలక్ష్మి` విడుదల కావాల్సి ఉంది.