Begin typing your search above and press return to search.

'సీటిమార్'తో పాటు విడుదలవుతున్న సినిమాల పరిస్థితి ఏంటి..??

By:  Tupaki Desk   |   26 March 2021 3:30 AM GMT
సీటిమార్తో పాటు విడుదలవుతున్న సినిమాల పరిస్థితి ఏంటి..??
X
2021 ఏడాది వేసవిలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గడిచిన సంవత్సరాలను గమనిస్తే మనకే అర్ధమవుతుంది. ఇదివరకు ఎవరో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ లో సెట్ చేసి పెట్టుకునేవారు. కానీ కరోనా తర్వాత అలా లేదు. స్టార్ నుండి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు అందరూ రిలీజ్ అంటూ ఎగబడుతున్నారు. కేవలం ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకే 50 - 70 సినిమాలకు పైగా విడుదలయ్యాయి. కానీ అన్నింటికి థియేటర్స్ దొరకవు కదా. అంటూ డిజిటల్ రిలీజ్, ఇటు థియేట్రికల్ రిలీజ్ కలిపి ఆ సంఖ్యలో రిలీజ్ అయ్యాయి. అయితే ఏప్రిల్ 2న చాలా సినిమాలే విడుదల అవుతున్నాయి.

కానీ వాటిలో మూడు సినిమాలే ముందు వరుసలో కనిపిస్తున్నాయి. గోపీచంద్ నటించిన సీటిమార్, కార్తీ నటించిన సుల్తాన్, అలాగే కన్నడ స్టార్ పునీత్ రాజకుమార్ నటించిన యువరత్న. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ 2న విడుదలకు రెడీ అవుతున్నాయి. కానీ ఇందులో సీటిమార్ డైరెక్ట్ తెలుగు సినిమా కాగా, సుల్తాన్, యువరత్న డబ్బింగ్ సినిమాలు. ఈరోజుల్లో నేరుగా రిలీజ్ అవుతున్న సినిమాలకే ఆదరణ సరిగ్గా ఉండటం అలాంటిది డబ్బింగ్ సినిమాలంటే జనాలు మొగ్గుచూపడం కష్టమే. అందుకే సీటిమార్ పేరు కాస్తోకూస్తో వినిపిస్తోంది కానీ.. సుల్తాన్, యువరత్న సినిమాల పేర్లు ఎక్కడా వినిపించడం లేదు. అంతేగాక రిలీజ్ దగ్గరపడుతున్న ఈ సినిమాలు ప్రమోషన్స్ కూడా సరిగా చేయడం లేదనే టాక్ నడుస్తుంది. మొత్తానికి తెలుగు మూవీ సీటిమార్ పేరే బాగా వినిపిస్తుండగా.. ఏప్రిల్ 2న నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కూడా విడుదల అవుతుండటం విశేషం. చూడాలి మరి ఏ సినిమా హిట్టు కొడుతుందో!