Begin typing your search above and press return to search.

వాయిదా పడ్డ 'సీటిమార్' కు మోక్షం ఎప్పుడో?

By:  Tupaki Desk   |   29 March 2021 11:30 AM GMT
వాయిదా పడ్డ సీటిమార్ కు మోక్షం ఎప్పుడో?
X
గోపిచంద్.. తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సీటిమార్ సినిమా ఏప్రిల్ 2 న విడుదల అవ్వాల్సింది VFX వర్క్ పెండింగ్ ఉండటం వల్ల విడుదల వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. వైల్డ్ డాగ్ మరియు వకీల్ సాబ్ సినిమాల పోటీకి భయపడి కూడా సినిమా విడుదల వాయిదా వేశారు అనికూడా ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా వకీల్ సాబ్ వాయిదా పడింది. సినిమా విడుదల కొత్త డేట్ కోసం యూనిట్ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు. కానీ వారికి పెద్ద సమస్య ముందు ఉంది.

గత ఏడాది కరోన కారణంగా థియేటర్లు మూసివేశారు. ఆ కారణంగా పదుల సంఖ్యలో సినిమాలు వాయిదా పడ్డాయి. అవన్నీ ఈ ఏడాది చివరి వరకు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా లైన్ కట్టి ఉన్నాయి. ముఖ్యమైన తేదీలను స్టార్ హీరోలు బుక్ చేసుకుంటే చిన్న సినిమాలకు కూడా వివిధ తేదీలు ఖరారు అయ్యాయి. కనుక సీటిమార్ సినిమా కొత్త విడుదల తేది నిర్ణయానికి చిక్కు వచ్చిపడింది.

రాబోయే రెండు మూడు నెలల్లో విడుదల చేయాలంటే ఏదో ఒక పెద్ద లేదా క్రేజీ సినిమాకు పోటీగా విడుదల చేయాల్సిందే అంటున్నారు. అలా చేస్తే సీటిమార్ మళ్ళీ ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే సీటిమార్ విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంతకు సీటిమార్ సినిమాకు మోక్షం ఎప్పుడో...?