Begin typing your search above and press return to search.

'సీటిమార్' లేటెస్ట్ రిలీజ్ డేట్ అదేనా..??

By:  Tupaki Desk   |   30 March 2021 4:52 PM GMT
సీటిమార్ లేటెస్ట్ రిలీజ్ డేట్ అదేనా..??
X
ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డేట్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యేవరకు నమ్మేలా లేదు. ఎందుకంటే అప్పుడే రిలీజ్ డేట్ దగ్గరపడిందని అనుకున్న సినిమాలు ఇలా ఏదొక కారణంతో విడుదలను వాయిదా వేస్తుంటాయి. కానీ ఒకసారి మిస్ అయిన డేట్.. మళ్లీ అంతే కంఫర్ట్ గా దొరకాలంటే చాలా కష్టమనే సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అలాంటి ఇరకాటంలోనే పడింది హీరో గోపీచంద్ నటించిన 'సీటిమార్' సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అవుతుందని మొన్నటివరకు హంగామా చేశారు మేకర్స్. తీరా రిలీజ్ టైం దగ్గర పడేసరికి విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ మళ్లీ రిలీజ్ ఎప్పుడనేది ఎవ్వరికి క్లారిటీ లేకుండా పోయింది.

ఇప్పటికే టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై ప్రేక్షకులలో ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అందరూ సినిమా అనుకున్న సమయానికి వస్తుందని మైండ్ లో ఫిక్స్ అయిపోయి సిద్ధంగా ఉన్నారు. కానీ చివరిలో మేకర్స్ షాకింగ్ న్యూస్ చెప్పేసరికి అందరూ చల్లబడిపోయారు. కానీ పాటలు మాత్రం ఓ రేంజిలో మోత మోగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. సీటిమార్ రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. నిజమో కాదో తెలియదు కానీ సీటిమార్ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. సినిమా ఎందుకు ఆగిందంటే.. గ్రాఫికల్ వర్క్ పెండింగ్ పడిందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహించగా శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.