Begin typing your search above and press return to search.

జ్వాలా రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన 'సీటీమార్' టీమ్..!

By:  Tupaki Desk   |   21 Dec 2020 11:50 AM GMT
జ్వాలా రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన సీటీమార్ టీమ్..!
X
యాక్షన్ హీరో గోపీచంద్ - మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ''సీటీమార్‌''. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడు యాక్ట్ చేయని విభిన్నమైన పాత్రలో.. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. నేడు హీరోయిన్ తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.

కోచ్ గెటప్ లో ఉన్న తమన్నా చేతులు వెనక్కి పట్టుకుని నిలబడి ఉండగా.. ఆమె వెనుక కబడ్డీ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. కాగా, ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా.. తమన్నా తెలంగాణ మహిళా జట్టుకు కోచ్ గా కనిపించనున్నానని తెలుస్తోంది. 'గౌతమ్ నంద' తర్వాత గోపిచంద్ - సంపత్‌ నంది కాంబోలో వస్తున్న ''సీటీమార్'' చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ చేస్తుండటంతో ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.