Begin typing your search above and press return to search.
రవితేజ రిలీజ్ చేసిన 'సీతాయణం' టీజర్..!
By: Tupaki Desk | 11 Nov 2020 3:10 PM ISTప్రముఖ కన్నడ హీరో శశికుమార్ 'బాషా' 'అమ్మలేని పుట్టిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పుడు శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ''సీతాయణం'' అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంతో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ ను కూడా అక్షిత్ పలకరించబోతున్నాడు. వై.వి.యస్ చౌదరి మరియు దశరథ్ ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రభాకర్ ఆరిపాక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోహన్ భరద్వాజ్ సమర్పణలో కలర్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షిత్ సరసన అనహిత భూషణ్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే విడుదలైన 'సీతాయణం' ఫస్ట్ లుక్ మరియు 'శ్రీరామ పత్ని' సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.
'కామి గాని వాడు మోక్షగామి కాలేడు' అంటూ సాగిన 'సీతాయణం' టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. 'తండ్రెవరో తెలియని అనాధగా అయినా బ్రతికేయవచ్చు.. కానీ శత్రువెవరో తెలియకపోతే ప్రతిక్షణం నరకమే' 'ఒక్కడైనా వందమంది అయినా వదలను.. ఐ విల్ ఫైట్ ఫర్ యూ' అంటూ హీరో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలానే అక్షిత్ భారీ యాక్షన్ సన్నివేశాలతో అలరించబోతున్నాడని తెలుస్తోంది. ఈ టీజర్ తో సినిమాలో లవ్ అండ్ క్రైమ్ డ్రామాతో నడిచే స్టోరీ అని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం అందించగా దుర్గాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. అజయ్ ఘోష్ - మధు నంధన్ - విధ్యులేఖ రామన్ - బిత్తిరి సత్తి - కృష్ణ భగవాన్ - గుండు సుదర్శన్ - అనంత్ - జభర్దస్త్ అప్పారావు - టియన్ఆర్ - మధుమణి - మేఘనా గౌడ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రెస్పెక్ట్ విమెన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న 'సీతాయణం' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.