Begin typing your search above and press return to search.

బన్నీని బాగా కాపీ కొట్టిన నిఖిల్!

By:  Tupaki Desk   |   2 Aug 2018 5:41 AM GMT
బన్నీని బాగా కాపీ కొట్టిన నిఖిల్!
X

ఎన్నైనా చెప్పండి గానీ కాపీ అనేది మన నరనరాల్లో జీర్ణించుకున్న అలవాటు. చాలామందికి అది చిన్నతనం నుండే అలవాటవుతుంది. ఇది పెద్దయ్యాక ఇంకా పెద్దదవుతుంది. అలాంటప్పుడు రైటర్లను - డైరెక్టర్లను - మ్యూజిక్ డైరెక్టర్లను - హీరోలను.. టోటల్ గా సినిమా వాళ్ళను మాత్రమే ఎందుకు తప్పు పట్టాలి. నిజంగా ఇందులో ఏం తప్పులేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కూడా అనుకున్నాడో ఏమో చక్కగా మన స్టైలిష్ స్టార్ ను కాపీ కొట్టాడు.

నిఖిల్ తెలుసు కదా 'జాగ్వార్' అనే కన్నడ - తెలుగు బైలింగ్వల్ సినిమా తో తన లక్కును టెస్టు చేసుకున్నాడు. పెద్దగా ప్రయోజనం కలగలేదు కానీ ఇప్పుడు 'సీతారామ కళ్యాణ' అనే సినిమా తో కన్నడ ప్రేక్షకుల మనసు దోచేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఆ టీజర్ చూస్తుంటే అందరికీ మన స్టైలిష్ స్టార్ గుర్తొస్తున్నాడు. బోయపాటి ఊరమాస్ స్టైల్ లో 'సరైనోడు' సినిమాలు బన్నీ యాక్షన్ సీన్స్ లో ఇరగదీస్తాడు కదా.. సరిగ్గా అదే సెటప్ ను నిఖిల్ కు సెట్ చేశారు. బాడీ లాంగ్వేజ్ మాత్రమే అని మీరు అనుకోవద్దు.. వెనకున్న టెంపుల్ - జాతర డ్యాన్సులు అన్నీ మక్కికి మక్కి దించారు. ఇంకో సీన్లో 'రేస్ గుర్రం' బన్నీ గుర్రంతో పాటు రన్నింగ్ చేస్తాడు కదా అలా ఇక్కడ నిఖిల్ ఎద్దులతో పాటు రన్ చేస్తాడు.

మరి ఇది 'సరైనోడు' రీమేకో ఏమో మనకు తెలీదు.. అలా అని మేకర్స్ కూడా ఇప్పటివరకూ అధికారికంగా ఈవిషయాన్ని ప్రకటించలేదు. దీంతో సోషల్ మీడియా లో నిఖిల్ పై బన్నీ ని కాపీ కొట్టాడని సెటైర్లు పడుతున్నాయి. మరి మీరు ఆ 'సీతారామ కళ్యాణ' టీజర్ పై ఓ లుక్కేయండి.