Begin typing your search above and press return to search.

జైభీమ్ సినిమాపై సీతక్క ట్వీట్.. హీరో సూర్య షాకింగ్ రిప్లై

By:  Tupaki Desk   |   18 Nov 2021 6:35 AM GMT
జైభీమ్ సినిమాపై సీతక్క ట్వీట్.. హీరో సూర్య షాకింగ్ రిప్లై
X
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం జైభీమ్. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్ లు కాదని నిరూపించిన మూవీ జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది.

సూర్య హీరోగా కర్ణాటకలోని ఒక నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనాన్ని అందరూ శభాష్ అనిపించేలా తీశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాదు.. అనేక రికార్డులను తిరగరాస్తోంది.

ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) హీరో సూర్యకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్వీట్ చేస్తూ ‘జైభీమ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా.. చిత్ర బృందానికి ముందస్తుగా నా అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యే సీతక్క ట్వీట్ కు హీరో సూర్య స్పందించారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కృతజ్ఞతలు మేడం.. మా చిత్ర బృందం తరుఫున మీకు కృతజ్ఞతలు’ అని సూర్య రిప్లై ఇచ్చారు.