Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: అయ్యా మీరు నటిస్తారా లేదా?

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:37 AM GMT
ట్రైలర్ టాక్: అయ్యా మీరు నటిస్తారా లేదా?
X
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'సీతాకాత్తి' ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక వయసుమళ్ళిన తమిళ సినిమా సూపర్ స్టార్ 'అయ్యా 'పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. 'అయ్యా' కోసం జనాలు పిచ్చెక్కి పోతుంటారు.. నిర్మాతలు దర్శకులు అయన కాల్ షీట్ల కోసం క్యూలో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు సడెన్ గా సినిమాలు మానేస్తాడు.

అయన కమిట్ మెంట్స్ అన్నీ పూర్తిచేసి రిటైర్ మెంట్ ప్రకటిస్తే సరేగానీ.. అలా కాకుండా అయన నటిస్తున్న పలు సినిమాలను మధ్యలోనే వదిలేస్తాడు. దీంతో అదో పెద్ద హంగామా ఆవుతుంది. ఆయన సినిమాల నిర్మాతలు ఇదేంటని నిర్మాతల సంఘాన్ని ఆశ్రయిస్తారు. కోర్టుకూ వెళ్తారు. జడ్జ్ కూడా 'అయ్యా మీరు నటిస్తారా లేదా?' అని అడుగుతారు. మరి 'అయ్యా' అలా ఎందుకు చేశారు అన్నది ప్రధానాంశంగా ఉన్నట్టు ట్రైలర్ లో చూపించారు. ముదుసలిగా విజయ్ సేతుపతి మేకప్ చాలా బాగుంది. సినిమా కథ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే '96' సినిమాలో నలభై ఏళ్ళ ప్రేమికుడి పాత్రలో జీవించి అందరి ప్రశంసలు అందుకున్న విజయ్ మరోసారి ఛాలెంజింగ్ పాత్రలో చెలరేగిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు బాలాజీ ధరణీధరన్. పార్వతీ నాయర్ ఫిమేల్ లీడ్. గోవింద వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20 న రిలీజుకు సిద్ధం అవుతోంది. ట్రైలర్ తమిళమే కానీ కింద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్ ఉన్నాయి కాబట్టి తాపీగా ఒక లుక్కేయండి.