Begin typing your search above and press return to search.

హిందీ ఛాన్సులు వద్దంటున్న బుజ్జిమ్మ

By:  Tupaki Desk   |   18 March 2015 9:30 AM GMT
హిందీ ఛాన్సులు వద్దంటున్న బుజ్జిమ్మ
X
రన్‌ రాజా రన్‌ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకి పరిచయమైంది సీరత్‌కపూర్‌. చూడగానే ఆస్ట్రేలియా నుంచి వచ్చిందా? న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి అయ్యిందా? అన్న సందేహాలొస్తాయి. కానీ ఈ అమ్మడు ముంబై నుంచి వచ్చింది. తొలుత అక్కడ వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా సినీవినీలాకాశంలో అడుగు పెట్టింది.

తొలి అడుగే రన్‌ రాజాతో విజయం అందుకుని, ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఈ అమ్మడు దక్షిణాదిన మూడు సినిమాలకు ఓకే చెప్పింది. సుమంత్‌ అశ్విన్‌ సరనన ఓ సినిమా, మలయాళంలో దుల్కార్‌ సల్మాన్‌ సరసన ఓ సినిమా అంగీకరించింది. అంతకంటే ముందే సందీప్‌కిషన్‌ సరసన నటించిన 'టైగర్‌' రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ ఉగాదికి టైగర్‌ రిలీజవుతోంది.

ఈలోగానే హిందీ నుంచి ఓ భారీ అవకాశం అమ్మడిని వరించింది. అయితే పూర్తిగా దక్షిణాదిన యువహీరోల సరసన పాపులర్‌ అవ్వాలన్నది సీరత్‌ ఆలోచన. అందుకే ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. సౌత్‌ హీరోల్ని చుట్టేయాలనేదే అమ్మడి ప్లాన్‌!!