Begin typing your search above and press return to search.

శర్వా హీరోయిన్.. గ్లామర్ కి కొలంబస్

By:  Tupaki Desk   |   28 Dec 2016 1:30 AM GMT
శర్వా హీరోయిన్.. గ్లామర్ కి కొలంబస్
X
శర్వానంద్ మూవీ రన్ రాజా రన్ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ శీరత్ కపూర్. రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈ భామ.. ఆ తర్వాత వరుసగా మూడు తెలుగు సినిమాలు చేసేసింది. శర్వాతో చేసిన రన్ రాజా రన్ సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత టైగర్.. కొలంబస్ మూవీల్లో కుర్రాళ్లు ఆఫర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ బ్యూటీ స్పీడ్ తగ్గిపోయింది.

అయితే.. ఒకసారి గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఇలాంటి గ్యాప్ లు సహజంగానే వస్తుంటాయి. వాటిని బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఎలా ఉపయోగించుకోవాలో ఈ భామలకు బాగానే తెలుసు. పైగా కొరియోగ్రాఫర్ కూడా కావడంతో.. ఇప్పుడు తన అందాలను మరింతగా ఇనుమడింప చేసేసుకుంది. బాడీలో ఫిట్నెస్ పెంచింది.. సోకుల్లో మెలికలు చేర్చింది.. ఎక్స్ పోజింగ్ డోస్ పెంచింది. అన్నీ కలిపి.. ఇప్పుడీ బ్యూటీ బికినీతో రెచ్చగొట్టే పోజులు ఇచ్చేస్తోంది శీరత్.

కొలంబస్ అనే టైటిల్ తో చేసిన సినిమా బాగా ఇన్ స్పైర్ చేసినట్లుగా ఉంది ఈ భామను. అందుకే కొలంబస్ వెస్ట్ ఇండీస్ ని కనిపెడితే.. కొలంబస్ మూవీలో కనిపించిన ఈ బ్యూటీ.. సోయగాలను ఎలా నాజుకుగా మెరిపించాలో కొత్త టెక్నిక్ కనిపెట్టినట్లుగా ఉంది. మరి ఈ రేంజ్ గ్లామర్ తెచ్చుకున్నాక అయినా శీరత్ కపూర్ అవకాశాలు అందిపట్టుకుంటుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/