Begin typing your search above and press return to search.

కంగన తర్వాత.. మరో కంగన

By:  Tupaki Desk   |   29 Jun 2015 11:54 PM IST
కంగన తర్వాత.. మరో కంగన
X
నాలుగు పలకలతో రెక్టాంగిల్‌లా ఉండే ముఖాకృతి.. ఎర్రెర్రెని వర్ణంతో రింగు రింగుల జుత్తు.. సూదంటురాయి లాంటి ముక్కు .. దొండపండు పెదవులు.. క్రీగంటి చూపులు ఇవన్నీ గ్రీకు సుందరి లక్షణాలు. ఇలాంటి అరుదైన లక్షణాలు ఉన్న కథానాయికలు ఎందరున్నారు? అని వెతికితే ఇద్దరే ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు బాలీవుడ్‌లో, వేరొకరు టాలీవుడ్‌లో ఉన్నారు.

బాలీవుడ్‌లో కంగన రనౌత్‌ని చూడగానే ఏ గ్రీస్‌ దేశం నుంచో వచ్చిందని అనుకుంటాం. పైన చెప్పిన పోలికలన్నీ తనకి అచ్చుగుద్దినట్టే ఉంటాయి. అందుకే దేశవ్యాప్తంగా యువతరం కంగన అందానికి ఫిదా అయిపోయారు. అయితే కంగన లాంటి నాయిక మనకు లేదే? అనుకున్న వాళ్లకు ఆ లోటు తీర్చడానికి ఓ భామ ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఈ భామ పేరు సీరత్‌ కపూర్‌. కంగనకి చెల్లెమ్మలా ఉండే ఈ భామ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది.

సీరత్‌ వస్తూనే రన్‌ రాజా రన్‌ అంటూ శర్వానంద్‌ సరసన నటించి హిట్‌ కొట్టింది. ఆ తర్వాతి ఇప్పుడు సందీప్‌ కిషన్‌ సరసన నటించిన రెండో సినిమా టైగర్‌ కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. సీరత్‌ రెండు సినిమాలకే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. సమంత లానే ఈ అమ్మడు కూడా గోల్డెన్‌ లెగ్‌. తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న సెంటిమెంటు రాజుకుంది. ఇక ఛాన్సులే ఛాన్సులు. స్టార్‌ హీరోల చూపు అప్పుడే ఈ గ్రీకు సుందరిపై ప్రసరించిందని తెలుస్తోంది.