Begin typing your search above and press return to search.

గిరజాల జుట్టు బేబీకి బ్రేకొస్తుందా??

By:  Tupaki Desk   |   25 Jun 2015 5:30 PM GMT
గిరజాల జుట్టు బేబీకి బ్రేకొస్తుందా??
X
సమంత.. శృతి హాసన్‌.. వీళ్ళ సీన్‌ కూడా పూర్తయిపోయి ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశి ఖన్నా స్వింగులోకి వచ్చేస్తారని అనిపిస్తోంది.. కాని మరో యాంగిల్‌లో చూస్తే ఏ హీరోయిన్‌ కూడా పెద్ద హిట్టు కొట్టట్లేదు. సమంత ఈ ఏడాది సన్‌ ఆఫ్‌ సత్యమూర్తితో కొట్టేసి కామ్‌ అయిపోయింది. అంతకు ముందు శృతి రేసు గుర్రంతో అరిపించి మాయం అయ్యింది. సో, కొత్త హీరోయిన్స్‌ అవసరం మనకు ఎంతైనా ఉంది.

ఇక రకుల్‌, రాశి ఫుల్‌గా బిజీ. చూస్తుంటే మరో నాలుగు సినిమాలకు వీళ్ళు సిమ్రాన్‌, సాక్షి శివానంద్‌ టైపులో జనాలకు బోరు కొట్టేస్తారేమో అనే సందేహమూ వస్తోంది. అందుకే ఇప్పుడొచ్చే కొత్త సినిమాల్లో ఎవరైనా స్టార్‌గా రూపాంతరం చెందుతారా అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు మరి. వాస్తవానికి రేపు వచ్చే టైగర్‌, జాదూగాడు సినిమాల్లో సీరత్‌ కపూర్‌, సోనారిక బడోరియా లు హీరోయిన్స్‌. సోనారిక సీరియల్స్‌ ద్వారా సుపరిచితం. కాకపోతే కాస్త బొద్దుగా ఉండటం వలన ఎందుకో అమ్మడిలో యంగ్‌ లుక్‌ మిస్సవుతోంది.

ఇకపోతే సీరత్‌ విషయానికొస్తే.. రన్‌ రాజా రన్‌ సినిమాతో అమ్మడు బాగానే ఎట్రాక్ట్‌ చేసింది. ఓ ప్రక్కన డస్కీగా, మరో ప్రక్క రింగుల జుట్టులో సెక్సీగా.. అబ్బో ఇరగదీసింది. మరి టైగర్‌ సినిమాతో కూడా ఆకట్టుకుంటే ఓ పెద్ద హీరోయిన్‌ అయ్యే ఛాన్సుంటుంది. ఇంటర్యూలో మాత్రం చాలా కాన్ఫిడెంటుగా చింపేస్తా అంటోంది.. చూద్దాం సినిమా చూస్తే మ్యాటర్‌ తెలిసిపోతుందిగా...