Begin typing your search above and press return to search.

టైగర్‌ స్పెషల్‌: అస్సలు ఊహించి ఉండదు

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:24 AM GMT
టైగర్‌ స్పెషల్‌: అస్సలు ఊహించి ఉండదు
X
సీరత్‌ కపూర్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ ఈ నామధేయం. ఆ పాల నురుగు సౌందర్యం, ఎర్రెర్రని రింగుల జుత్తు చూసి .. ఈ అందగత్తె ఏ ఆస్ట్రేలియా నుంచో న్యూజిల్యాండ్‌ నుంచో ఇండియాలో దిగిపోయిందని అనుకున్నారంతా. బుల్లితెరపై ఫెయిర్‌నెస్‌ క్రీము ప్రకటనలో కనిపించిన ఈ అమ్మడు ముంబై నుంచి నేరుగా టాలీవుడ్‌లో దిగిపోయింది. ఇక్కడ వస్తూనే శర్వానంద్‌ సరసన 'రన్‌ రాజా రన్‌' చిత్రంలో నటించి హిట్‌ కొట్టింది.

తొలి సినిమానే హిట్‌. ఇంకేముంది.. పోరిలో వొగలుంది. గిగులుంది. అందం ఉంది. వాడి ఉంది. వేడి ఉంది.. అంటూ సందీప్‌ కిషన్‌ ఛోటా మామని సంప్రదించి ఎంపిక చేసుకున్నాడు. దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ కూడా వంత పాడాడు. టైగర్‌లో కూడా ఇప్పుడు పర్వాలేదు అనే టాక్‌నే అందుకుంటోంది ఈ ఎర్రకురుల సౌందర్యరాశి. యితే ఇదేదీ సీరత్‌ అస్సలు ఊహించి ఉండదు. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో కర్ఛీఫ్‌ వేస్తానని అనుకుని ఉండదు. ముంబై రోషన్‌ తనేజా యాక్టింగ్‌ స్కూల్లో నటనలో పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు కానీ, 15 వయసుకే ముంబై ఆస్లే లోబో డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో కొరియోగ్రాఫర్‌గా పనిచేసినప్పుడు కానీ, రాక్‌స్టార్‌ సినిమాకి అసిస్టెంట్‌ కొరియోగ్రఫీ చేసిినప్పుడు కానీ ఇలా వేరొక భాషలో స్టార్‌ అవుతానని అనుకుని ఉండదు.

కానీ అనుకోని అద్భుతమే జరిగింది. ఊహించని విధంగా కర్ఛీఫ్‌ వేసింది. వరుసగా రెండు హిట్‌ సినిమాల్లో నటించింది. ఇకముందు ఇంకెన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందో, కెరీర్‌ పరంగా గ్రాఫ్‌ని ఏ రేంజుకు తీసుకెళ్తుందో వెయిట్‌ అండ్‌ సీ.