Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ కోసం పరితపిస్తోంది

By:  Tupaki Desk   |   27 Jan 2018 8:00 PM IST
ఒక్క హిట్ కోసం పరితపిస్తోంది
X
రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఫ్యాషన్ బ్యూటీ సీరత్ కపూర్ మొదట్లో లిమిట్ అందాలతో బాగానే ఆకర్షించింది. మొదటి హిట్టు పడగానే అవకాశాలు చాలా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత వచ్చిన చిన్న చిత్రాలు ఏ మాత్రం హిట్ అవ్వకపోవడంతో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో తన అందాలతో సోషల్ మీడియాని షేక్ చేసింది.

టాప్ లెస్ పోటోషూట్స్ తో ఒక్కసారిగా కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది. అవకాశాల కోసం వాడిన ఆ ఫార్ముల అమ్మడికి బాగానే ఉపయోగపడింది. కానీ ఆమె నటించిన సినిమాలు అంతగా క్లిక్ అవ్వలేదు. రాజు గారి గది 2 - ఒక్క క్షణం సినిమాలు క్రేజ్ ఇవ్వలేకపోయాయి. దీంతో సీరత్ ఇంకా ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తోంది. ఇక నెటిజన్స్ లో మళ్లీ ఫొటో షూట్స్ ఏమైనా ప్లాన్ చేస్తోందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి.

ఎందుకంటే సీరత్ కి ఇప్పుడు తప్పనిసరిగా హిట్ పడాలి లేకుంటే కెరీర్ మళ్లీ డౌన్ అవుతుంది. అందాల వల వేసి దక్కించుకున్న సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమానే ఉంది. అదే రవితేజ టచ్ చేసి చూడు. అందులో మెయిన్ హీరోయిన్ కాకపోయినా గ్లామర్ భారాన్ని మొత్తం తనే మోయనుందట. ఆ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని సీరత్ బలంగా కోరుకుంటోంది. మరి ఆ సినిమా ఈ బ్యూటీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.