Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఆయనపై అలిగితివా సీనయ్యా?
By: Tupaki Desk | 31 Oct 2020 10:00 AM ISTదాదాపు రెండు దశాబ్ధాలు అగ్ర దర్శకుడిగా సత్తా చాటిన ఆయన అనూహ్యంగా హీరోగా ట్రై చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉన్నట్టుండి రూపం మార్చి అందుకోసం కఠోరంగా శ్రమించి పట్టుదల కసి చూపించడంతో అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఇంకేం ఉంది. స్టార్ డైరెక్టర్ హీరో అయినట్టేనని భావించారు.
పైగా ఆ సినిమాకి పోస్టర్లు వేసి టైటిల్ లాంచ్ చేసి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా అయ్యింది. ఇంత చేశాక మధ్యలో తుస్సుమనిపిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది. పాపం ఆ డైరెక్టర్ అలానే హర్టయ్యారన్న గుసగుసలు ఆ తర్వాత వినిపించాయి. ఇంత పబ్లిసిటీ వచ్చేశాక జనానికి ఏమని చెప్పుకోవాలి. సినిమా వస్తుందా రాదా ? అన్న ప్రశ్న ఎదురైతే ఆ సీన్ ఎలా ఉంటుందో చెప్పాలా?
అందుకే ఇప్పుడు హీరో కాబోయి మిడిల్ డ్రాప్ అవ్వాల్సి రావడంతో సదరు నిర్మాత వైఫల్యంపై అలకబూనారట. అన్నట్టు ఆ నిర్మాత అంటే అతడికి ఎంతో ఇష్టం. ఇక తనని నిర్మాతను చేసిన ఆ డైరెక్టర్ అన్నా ఆ నిర్మాతకు ప్రాణం. కానీ సీన్ ఇలా అవుతుందనుకోలేదు. అయితే ఇందులో ఆ ఇద్దరి తప్పేమీ లేదట. హీరోని చేస్తానన్న డైరెక్టర్ సరిగా సినిమాని తీయలేక చతికిలబడడమే ఇందుకు కారణం అన్న గుసగుసలు కూడా వినిపించాయి ఇటీవల. మరి ఇందులో వాస్తవాలేమిటో చిత్రబృందానికి క్లారిటీ తెలుసు మరి. హీరో అవ్వాలని ఆర్నెళ్లు జిమ్ముల్లో కఠోరంగా శ్రమించి 10 కేజీలు తగ్గాక ఇలా చేస్తే ఎవరికైనా ఏం బావుంటుంది అయినా?