Begin typing your search above and press return to search.

అది చూసి ఆరోజు సామ్ ఏడ్చేసింది: డైరెక్టర్స్ రాజ్-డీకే

By:  Tupaki Desk   |   21 May 2021 4:31 AM GMT
అది చూసి ఆరోజు సామ్ ఏడ్చేసింది: డైరెక్టర్స్ రాజ్-డీకే
X
స్టార్ హీరోయిన్ స‌మంత త్వరలోనే పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతుంది. ప్రస్తుతం సౌత్ వరకే సమంత బాగా సుపరిచితం. కానీ ఓ వెబ్ సిరీస్ కారణంగా సామ్ త్వరలో దేశవ్యాప్తంగా ఫేమ్ పొందనుంది. ప్రస్తుతం సామ్ సినిమాల గురించి కాకుండా ఆమె నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ గురించి చర్చ నడుస్తుంది. గతేడాది కాలంగా సామ్ ఫ్యాన్స్ ఆ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సమంత ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి ఓ వెబ్ సిరీస్ లో న‌టించిన విష‌యం తెలిసిందే. 2019లో మంచి ప్రేక్షకాదరణ పొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ సీక్వెల్ గా 'ది ఫ్యామిలీ మ్యాన్: సీజ‌న్ 2' తెరకెక్కింది. ఈవెబ్ సిరీస్ ద్వారా సామ్ డిజిటల్ ప్రపంచంలో అడుగు పెడుతోంది.

ఎందుకో గాని పలు కార‌ణాల వలన ఈ వెబ్ సిరీస్ ఇంతకాలం వాయిదాప‌డింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మోస్ట్ అవెయిటింగ్ "ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2` స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. అదిగాక ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మొత్తానికి జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ట్రైలర్ ద్వారానే సిరీస్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫస్ట్ సీజ‌న్ లో న‌టించిన మ‌నోజ్ బాజపేయ్, ప్రియ‌మ‌ణితో స‌హా ప‌లువురు సీసన్ 2లో కొన‌సాగ‌నున్నారు. స‌మంత విష‌యానికి వ‌స్తే రాజీ అనే ఓ లేడీ టెర్ర‌రిస్ట్ పాత్రలో నెగ‌టివ్ షేడ్స్ తో రెడీ అయిపోయింది. అయితే ఇదివరకే మేకర్స్ రాజ్ అండ్ డీకే.. ఈ సిరీస్ లోకి సామ్ ఎలా సెలెక్ట్ అయ్యిందనే విషయం వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ లో ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ క్యారెక్టర్ కోసం సౌత్ యాక్ట్రెస్ కావాలని చూస్తున్న సమయంలో సూపర్ డీలక్స్ సినిమా చూసాం. అందులో సమంత యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాం. ఆ వెంటనే సమంతను కలిసి స్టోరీ వినిపించాము. ఆమె సానుకూలంగా స్పందించిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ లో సమంతను చాలా బోల్డ్ లుక్కులో డి-గ్లామరస్ గా కనిపిస్తుంది. ఆమె మాత్రం తన పాత్ర మేరకు ది బెస్ట్ ఇచ్చిందని ట్రైలర్ లో వెళ్లడైంది. అయితే ప్రతి షూటింగ్ లో నటులకు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ - మర్చిపోలేని సంఘటనలు జరుగుతాయి. తాజాగా డైరెక్టర్స్ సామ్ ఎమోషనల్ మూమెంట్ గురించి తెలిపారు. 'ఓరోజు షూటింగ్ లో సీక్వెన్స్ కంప్లీట్ చేసాక సమంతను వచ్చి చూడమని చెప్పాము. ఆమె చూసి వెంటనే ఏడుపు ఆపుకోలేక క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.