Begin typing your search above and press return to search.
ఆ పరామర్శతో మనసు దోచిన బాలయ్య
By: Tupaki Desk | 30 April 2021 4:03 PM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ షార్ట్ టెంపర్ గురించి కొన్నిసార్లు మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ఆయనలోని మంచితనం గురించి అభిమానులతో కుశల ప్రశ్నల గురించి ఇతరులకు తెలిసింది తక్కువే. హీరో బాలకృష్ణ తన సీనియర్ అభిమాని కుమారుడు బళ్లారి బాలయ్య తో టెలిఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బళ్లారి బాలయ్య పరిచయం అవసరం లేదు. ఆయన.. ఆయన కుటుంబం దశాబ్దాలుగా నందమూరి కుటుంబానికి నమ్మకమైన అభిమానులు. వాస్తవానికి బళ్లాయ బ్యాలయ్య తన స్టైలిష్ లుక్ తో నే బోలెడంత పాపులారిటీ సంపాదించారు. బాలయ్య లెజెండ్ లుక్ తో అతడు కనిపించి అభిమానుల్ని మురిపించారు.
దురదృష్టవశాత్తు బళ్లారి బాలయ్య గత ఉగాది నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. అతను ఏప్రిల్ 26 న తుది శ్వాస విడిచాడు. ఆ రోజు సాయంత్రం బాలయ్య తన అభిమానుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
బళ్లారి బాలయ్యకు భార్య ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు అందరూ వివాహం చేసుకున్నారు. బల్లయ్య బళ్లారి బాలయ్య కొడుకు. సంతాపం తెలపడమే గాక కష్టంలో వారికి అండగా నిలుస్తానని బాలయ్య హామీ ఇవ్వడం అందరి హృదయాలను గెలుచుకుంటోంది. బాలయ్యలో ఈ కొత్త కోణం అందరినీ ఆకట్టుకుంది.