Begin typing your search above and press return to search.

ఆ టాట్టూ వెన‌క సీక్రెట్ ఏంటి ప్రియా?

By:  Tupaki Desk   |   24 Jan 2019 10:42 AM IST
ఆ టాట్టూ వెన‌క సీక్రెట్ ఏంటి ప్రియా?
X
క‌న్నుగీటి కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టి అసాధార‌ణ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. `ఒరు ఆడార్ ల‌వ్` టీజ‌ర్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపోయిన ఈ మ‌ల్లూ బ్యూటీ ఒకానొక సంద‌ర్భంలో హౌస్ అరెస్టుకు గుర‌య్యాన‌ని చెప్పింది. త‌న‌ని క‌లిసేందుకు ఎవ‌రెవ‌రో ఇంటి చుట్టూ తిరుగుతుంటే, త‌న త‌ల్లిదండ్రులు బెంబేలెత్తిపోయార‌ని, త‌న‌ని క‌ల‌వాల‌నుంద‌ని అడిగేస్తుంటే భ‌యంతో త‌న‌ని దాచేశార‌ని ప్రియా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

`ఒరు ఆడార్ ల‌వ్` తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ జేఆర్‌ సీలో జ‌రిగిన ఆడియో వేడుక‌లో ప్రియా ప్ర‌కాష్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ అంత‌టివాడే ప్రియా అంద‌చందాల‌కు, వింక్ సెన్సేష‌న్స్ కు ఫిదా అయిపోయి ఆఫ‌ర్ ఇచ్చాడు. అత‌డే ముఖ్య అతిధిగా జ‌రిగిన ఈవెంట్‌లో ప్రియాపైనే అంద‌రి క‌ళ్లు నిలిచాయి. ఆస‌క్తిక‌రంగా ప్రియా ప్ర‌కాష్ ఎడ‌మ భుజానికి దిగువ‌న‌, మెడ‌ను ఆనుకుని ఉన్న టాట్టూ క‌ల‌క‌లం రేపింది. ఆ టాట్టూ మీడియా కెమెరా కంట ప‌డ‌డం, ప‌దే ప‌దే అక్క‌డే ఫ్లాష్‌లు మెర‌వ‌డంతో ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.

ఇంత‌కీ ఆ టాట్టూలో ఉన్న మీనింగ్ ఏంటి? అని ప‌రిశీలిస్తే అదేమంత సింపుల్ గా డీకోడ్ చేయ‌గ‌లిగే ప‌దం కాద‌ని అర్థ‌మ‌వుతోంది. `Carper Diem` అంటూ టాట్టూలో రాసి ఉంది. ఇదో లాటిన్ ప‌దం. `Carpe diem quam minimum credula postero` అనేది సంపూర్ణ‌మైన వాక్యం. ``ప్ర‌స్తుతంలో జీవించండి`` అనేది దీన‌ర్థ‌మ‌ట‌. పూర్తిగా విశ్లేషిస్తే.. ``భ‌విష్య‌త్ పై చిన్న‌పాటి ఆశ‌, న‌మ్మ‌కంతో నేడు జీవించండి`` అనే అర్థం వ‌స్తోందిట‌.