Begin typing your search above and press return to search.

చైనా వెళ్తున్న సీక్రెట్ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   28 Oct 2017 1:46 PM GMT
చైనా వెళ్తున్న సీక్రెట్ సూపర్ స్టార్
X

దేశంలో అత్యంత సినిమా మార్కెట్ ఉన్న అమిర్ ఖాన్ ఏనాడు తన హోదాను ప్రత్యేకంగా చూపించుకోలేదు. ఒక్క సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని ప్రతి హీరో అనుకుంటాడు. కానీ ఇండియన్ మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం తక్కువ రేంజ్ ఉన్న పాత్రను చేసి ఎక్కువ స్థాయిలో ఆదరణను అందుకుంటాడు. కెరీర్ లో ఎన్ని సినిమాలు బ్లక్ బస్టర్స్ గా నిలిచినా అమిర్ ప్రయోగాలను మాత్రం అస్సలు విడువడం లేదు.

అంతే కాకుండా టాలెంట్ ఉన్న దర్శకులను అమిర్ గుర్తించి మరి అవకాశాలను ఇస్తుంటాడు. దంగల్ సినిమా దర్శకుడు నితిష్ తివారి అంతకుముందు రెండు సినిమాలను మాత్రమే తెరకెక్కించాడు. అమిర్ అతని దర్శకత్వ ప్రతిభను గుర్తించి దంగల్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అమిర్ నిర్మాతగాను ఎన్నో చిన్న సినిమాలను నిర్మించాడు. ఇటీవల దంగల్ లో నటించిన జైరా వసీమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కూడా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఆ సినిమాలో ఆమిర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించాడు. త్వరలో ఈ సినిమాను కూడా చైనాలో రిలీజ్ చేస్తామని అమిర్ తెలిపాడు.

దంగల్ సినిమాను చైనా లో రిలీజ్ చేసినప్పుడు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా ఆ దేశం అధ్యక్షుడే స్పెషల్ షో వేసుకొని మరి సినిమాను తిలకించాడు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీక్రెట్ సూపర్ స్టార్ కూడా అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకంతో మరికొన్ని రోజుల్లో చైనాలో రిలీజ్ చేయాలనీ అమిర్ నిర్ణయించుకున్నారు.