Begin typing your search above and press return to search.

60 రోజుల సస్పెన్స్ ఏంటి నాగ్ ?

By:  Tupaki Desk   |   24 Jan 2019 10:13 AM GMT
60 రోజుల సస్పెన్స్ ఏంటి నాగ్ ?
X
తన రెండో వారసుడు అఖిల్ మిస్టర్ మజ్ను రేపు విడుదల కానున్న నేపధ్యంలో నాగార్జున కూడా కొంత టెన్షన్ గా ఉన్నాడు. అఖిల్ తెరకు పరిచయమై మూడేళ్ళు అయ్యింది. మొదటి రెండు సినిమాలు పోయాయి. ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన టార్గెట్ తో తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో ఏరికోరి మరీ రొమాంటిక్ సబ్జెక్టు తీసుకున్నారు. అదలా ఉంచితే కొడుకుతో పాటు యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగార్జున తెలుగులో చేయబోయే కొత్త సినిమా విశేషాలేమి చెప్పడం లేదు. మార్చ్ నుంచి ఓ 60 రోజుల పాటు ఫారిన్ షెడ్యూల్ లో బిజీ అయిపోతా అంటున్నాడు.

అంటే ఏదో ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టెగా. అయితే అది కళ్యాణ్ కృష్ణ తో చేయాలనుకున్న బంగార్రాజునా లేక రాహుల్ రవీంద్రన్ కు మాటిచ్చిన మన్మధుడు సీక్వెలా అనే క్లారిటీ లేదు. నాగార్జున కూడా చెప్పడం లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటున్నాడు. అయితే రెండు సినిమాల కాన్సెప్ట్ గమనిస్తే ఇది మన్మధుడు లాంటి కథ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ పార్ట్ లో పారిస్ ఎపిసోడ్ తో బ్రహ్మాండమైన నవ్వులు పూయించారు.

అయితే బంగార్రాజు పక్కా పల్లెటూరి పాత్ర కాబట్టి అంత పెద్ద ఫారిన్ షెడ్యూల్ అవసరం లేదు. ఒకవేళ బంగార్రాజు అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఏమైనా కొత్తగా రాసుకున్నారేమో తెలియదు. ఈ వివరాలు చెప్పలేదు నాగ్. ఒకవేళ షేర్ చేసుకుంటే మిస్టర్ మజ్ను మీద నుంచి ఫోకస్ తనవైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి స్కిప్ చేసి ఉండొచ్చు.మార్చి ఎంతో దూరంలో లేదు. మిస్టర్ మజ్ను సందడి కాస్త తగ్గాక ఎలాగూ నాగ్ స్వయంగా షేర్ చేసుకుంటాడు కాబట్టి అప్పటిదాకా వెయిట్ అండ్ సీ