Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ ఆన్ లైన్ టికెటింగ్ తేవ‌డం వెన‌క గుట్టు ర‌ట్టు!

By:  Tupaki Desk   |   28 Sep 2021 8:30 AM GMT
సీఎం జ‌గ‌న్ ఆన్ లైన్ టికెటింగ్ తేవ‌డం వెన‌క గుట్టు ర‌ట్టు!
X
అస‌లు ప్ర‌భుత్వాలే సినిమా టికెటింగ్ పోర్ట‌ల్ తేవ‌డం వెన‌క లాజిక్ ఏమిటి? అస‌లు అలా రూల్ మార్చాల‌నుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? ఏపీ ప్ర‌భుత్వం.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌ల వెన‌క అస‌లు కార‌ణ‌మేమిటీ? అంటే ఎగ్జిబిట‌ర్ కం డిస్ట్రిబ్యూట‌ర్ కం నిర్మాత న‌ట్టి కుమార్ ఇచ్చిన వివ‌ర‌ణ షాకిస్తోంది. ఏపీకి ప‌న్నుల రూపంలో రావాల్సిన 2500 కోట్లు పైగా వార్షిక రాబ‌డి రావడం లేద‌న్న‌ది అటుంచితే రోజుకు ఎంత న‌ష్టం వాటిల్లుతుందో ఆయన లెక్క‌లు తీస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో న‌ట్టి ఇచ్చిన వివ‌ర‌ణ షాకిస్తోంది. ``సినిమా ఫీల్డ్ పెద్ద లాబీయింగ్. సినిమా ఫీల్డ్ శాసిస్తుంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద నేను అన‌లేదు కానీ.. ఆయ‌న నిజాలు తెలుసుకున్నారు కాబ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నారు. టిక్కెట్టు తెగితే ఆ డ‌బ్బు లో కొంత‌ ద‌ళారుల‌కు వెళుతోంది. ఒక్కో టిక్కెట్టుపై 27 రూపాయ‌లు పోతోంది. రూ.27 ఇన్ టు రోజుకు 10ల‌క్ష‌ల టిక్కెట్లు క్యాలిక్యులేట్ చేయండి. అదంతా ఆన్ లైన్ విధానంలో ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వాల‌కు చెంద‌కుండా పోతోంది.. అని న‌ట్టి విశ్లేషించారు.

ప్ర‌భుత్వానికి రూపాయి రాదు. నిర్మాత‌ల‌కు.. ఫిలింఛాంబ‌ర్ కు.. కౌన్సిల్ కు.. థియేట‌ర్ల‌కు .. ఎవ‌రికీ రూపాయి రావ‌డం లేదు. ఆన్ లైన్ వ‌ల్ల ద‌ళారుల‌కు వెళుతోంది. బుక్ మై షో.. పేటీఎం ఏదైనా కావొచ్చు.. డబ్బంతా వాళ్ల‌కు పోతోంది. ఆ డ‌బ్బును ప్ర‌భుత్వం ఎందుకు వెన‌క్కి తెచ్చుకోకూడ‌దు. దానిని పేద‌ల‌కు ఎందుకు ఖ‌ర్చు చేయ‌కూడ‌దు. ఇది స‌క్సెసైతే 100 శాతం ఇండియా మొత్తం ఆన్ లైన్ అవుతుంది. ప్ర‌భుత్వ పోర్ట‌ల్స్ తెస్తారు! అని న‌ట్టి విశ్లేషించిన తీరు కాస్త ఆలోచింప‌జేస్తోంది. నిజ‌మే ఆన్ లైన్ టిక్కెట్టు కొట్టిన‌ప్పుడు రూ.20-30 వ‌ర‌కూ ఆన్ లైన్ ఛార్జీల పేరుతో ఎక్స్ ట్రా బాదుడు అంతా ఎటు పోతోందో ఇప్పుడు సామ‌న్యుల‌కు అవ‌గ‌త‌మ‌వుతోంది న‌ట్టి వివ‌ర‌ణ‌తో!! ఇక ఆన్ లైన్ టిక్కెట్ల‌పై ముద్రించే ప‌న్నుల్లోనూ అవ‌క‌త‌వ‌క‌ల‌పైనా డీటెయిలింగ్ వ‌స్తే మ‌రింత మంచిది అనేది కొంద‌రి వాద‌న‌.