Begin typing your search above and press return to search.
'సెకండ్ వేవ్' డైరీస్ ఆఫ్ టాలీవుడ్ సెలబ్రిటీస్..!
By: Tupaki Desk | 22 Jun 2021 8:00 AM ISTకరోనా మహమ్మారి ఇంతకాలం ఎవరిళ్లకు వారిని నిర్భందించడంతో సినీ సెలబ్రిటీలు సినిమాలు గురించి కాకుండా కొత్తకొత్త పనులు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అయిపోయారు. ఇదివరకు చూడని ఫోటోలు.. మెమోరీస్ అన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. కరోనా మహమ్మారి వలన విధించిన లాక్డౌన్ లో సెలబ్రిటీలు ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యారు. వారితో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు తోచిన సహాయం అందించే ప్రయత్నాలు చేశారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ చాలా ఇబ్బంది కలిగించింది.
అయితే ఈ సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఖాళీగా ఉండకుండా ఏమేమి చేసారో ఓసారి చూద్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలు ఉన్నా లేకపోయినా ఖాళీ సమయం దొరికితే మాత్రం మహేష్ తన ఫ్యామిలీకే టైం కేటాయిస్తాడు. అందులోను తన గారాలపట్టి సితారతో ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తాడు. అలా తండ్రి కూతురు కలిసి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇక మెగాపవర్ స్టార్ రాంచరణ్ సెకండ్ వేవ్ సమయంలో తన పెట్స్ తో టైంపాస్ చేసేసాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం కావడంతో షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఇక పుష్పారాజ్ అల్లు అర్జున్ లాక్ డౌన్ సమయంలో చాలా విలువైన పనే చేసాడు. ఏంటంటే.. మొక్కలు పెంచడంతో పాటు కొత్త మొక్కలు కూడా నాటి అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు. అలాగే అల్లు హీరో శిరీష్ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు. కానీ కనిపించినప్పుడు మాత్రం క్యారెమ్స్ ఆడుతూ బుక్స్ చదువుతూ టైం గడిపేశాడని తెలుస్తుంది. ఇక టాల్ హ్యాండ్సమ్ దగ్గుబాటి రానా.. సెకండ్ వేవ్ లాక్డౌన్ టైంలో కొత్తగా పెళ్లయింది కదా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఇక రౌడీహీరో విజయ్ దేవరకొండ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కోసం ఫిసికల్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా అందరూ హీరోలు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.