Begin typing your search above and press return to search.

ఆ గ్లాసులు బాబాయ్ కోసమేనా తేజు?

By:  Tupaki Desk   |   22 March 2019 8:59 AM GMT
ఆ గ్లాసులు బాబాయ్ కోసమేనా తేజు?
X
సాయి ధరం తేజ్ కొత్త సినిమా చిత్రలహరి వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే టీజర్ మంచి స్పందన దక్కించుకోగా మెల్లగా హైప్ ని పెంచే క్రమంలో మైత్రి సంస్థ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తోంది. ఈ నెల 24న అంటే ఎల్లుండి ఈ మూవీలోని ఒక సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. అందులో ఏముంది ఇది అందరూ చేసేదే కదా అనే అనుమానం రావొచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

గ్లాస్ మేట్స్ అంటూ సాగే ఈ పాటలో టీ గ్లాస్ ని హైలైట్ చేస్తున్నారు. జనసేన పార్టీ గుర్తు అదే. పవన్ మావయ్య అంటే విపరీతమైన అభిమానం చూపించే తేజు సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి పాటతో రావడం విశేషమే.కాకతాళీయంగా జరిగిందో లేక పర్ఫెక్ట్ టైం ని సెట్ చేసుకుని వదిలారో కాని దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ కనక ఆశించిన స్థాయిలో ఉంటే ఇది అభిమానుల మధ్య వైరల్ అయిపోయి రచ్చ కావడం తద్యం.

అందుకే గ్లాస్ మేట్స్ సాంగ్ మీద అప్పుడే ప్రత్యేకమైన అంచనాలు మొదలైపోయాయి. బహుశా ఫ్రెండ్స్ మధ్య టీ షేర్ చేసుకోవడం గురించో లేదా మందును పంచుకోవడం మీదనో ఇది ఉండబోతోందన్న క్లారిటీ అయితే వచ్చింది. పోస్టర్ లో అంత స్పష్టంగా టీ గ్లాస్ చూపించారు కాబట్టి ఇంకే అనుమానాలు అక్కర్లేదు. నివేతా పెతురాజ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరొయిన్లుగా నటిస్తున్న చిత్రలహరిని ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నారు