Begin typing your search above and press return to search.

వీడియో: 'అర్జున ఫల్గుణ' నుంచి కాపాడేవా రాపాడేవా..!

By:  Tupaki Desk   |   17 Nov 2021 11:20 AM GMT
వీడియో: అర్జున ఫల్గుణ నుంచి కాపాడేవా రాపాడేవా..!
X
ఇటీవల 'రాజ రాజ చోర' సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు.. ఇప్పుడు ''అర్జున ఫల్గుణ'' అనే మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ‘జోహార్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు తేజ మర్ని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేయబడిన టీజర్ - 'గోదారి వాళ్ళే సందమామా' పాట మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కాపాడేవా రాపాడేవా' అనే మరో పాటను రిలీజ్ చేశారు.

'ఏదేమైనా కానీరానీలేరా పోరా.. మీలా మీరే సాగీ పోవాలే.. కాపాడేవా రాపాడేవా..' అంటూ అమ్మోరు బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఇందులో పవర్ ఫుల్ రోల్‌ లో కనిపిస్తున్న శ్రీవిష్ణు.. తన స్నేహితులు మరియు ప్రేయసితో కలిసి ఏదో సంకల్పించారని తెలుస్తోంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరపరిచిన ఈ పాటను మోహన్ భోగరాజు ఆలపించారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు.

'అర్జున ఫల్గుణ' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందించగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. విప్లవ్ నైషదం ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.