Begin typing your search above and press return to search.

బాహుబలి వెబ్‌ సిరీస్‌ ఏమయ్యింది?

By:  Tupaki Desk   |   30 Jun 2020 4:00 PM IST
బాహుబలి వెబ్‌ సిరీస్‌ ఏమయ్యింది?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. బాహుబలి 2 చిత్రం విడుదలైన కొన్నాళ్లకు ఇదే కాన్సెప్ట్‌ తో వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించబోతున్నట్లు గా ఆర్కా మీడియా ప్రకటించింది. అన్నట్లుగానే దేవా కట్టా ఇంకా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వెబ్‌ సిరీస్‌ ను మొదలు పెట్టారు. మొత్తం 13 ఎపిసోడ్స్‌ లో ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందట. మొదటి ఎపిసోడ్‌ కు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించాడు.

ఆర్కా మీడియాతో పాటు ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మాణ భాగస్వామిగా ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ ప్లిక్స్‌ వ్యవహరించింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి చేయడంతో పాటు కొంత వరకు వీఎఫ్‌ఎక్స్‌ సీన్స్‌ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు బాహుబలి నెట్‌ ప్లిక్స్‌ గురించి పునరాలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. నెట్‌ ప్లిక్స్‌ ఇండియా ప్రతినిధులు ఇంకా కొందరు వెబ్‌ సిరీస్‌ రషెష్‌ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారట.

వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా చాలా లో క్వాలిటీ తో ఉందని బాహుబలి మేకర్స్‌ నుండి వస్తున్న మూవీ అంటే ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. కాని ఇది ఆ స్థాయిలో లేదని వారు అభిప్రాయ పడ్డారట. దాంతో ఆమద్య ఈ వెబ్‌ సిరీస్‌ పనులు నిలిపేసిన ఆర్కా మీడియా మళ్లీ ప్యాచ్‌ వర్క్‌ చేయిస్తుందట. కొన్ని ఎపిసోడ్స్‌ కు రీ షూట్‌ చేయడం తో పాటు వీ ఎఫ్‌ ఎక్స్‌ షాట్స్‌ ను కూడా మళ్లీ వర్క్‌ చేయించబోతున్నారట. మరి ఇప్పుడు అయినా నెట్‌ ప్లిక్స్‌ వారు సంతృప్తి చెందుతారేమో చూడాలి.