Begin typing your search above and press return to search.

అన‌వ‌స‌రంగా కొరివితో త‌ల గోక్కున్నాడా?

By:  Tupaki Desk   |   13 March 2021 10:00 PM IST
అన‌వ‌స‌రంగా కొరివితో త‌ల గోక్కున్నాడా?
X
రంగుల మాయా ప్ర‌పంచంలో ఏది హిట్టు ..? ఏది ఫ‌ట్టు? అన్న అంచ‌నా అంత తేలిగ్గా దొరికేయ‌దు. ఎంపిక చేసిన క‌థ‌- స్క్రిప్టుతోనే అన్నిటినీ డిసైడ్ చేసేయ‌లేం. జ‌నం డిసైడ్ చేసేదేంటో ఏ ద‌ర్శ‌క‌నిర్మాతా క‌నిపెట్ట‌లేరు. అలా క‌నిపెట్ట‌గ‌లిగే తాయ‌త్తు ఉంటే కోట్ల‌కు కోట్లు కొల్ల‌గొట్టేసేవారే.

ఇప్పుడు అలానే ఆ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కూడా తాను ఎంతో గొప్ప‌గా అనుకున్న ప్రాజెక్ట్ విష‌యంలో త‌డ‌బ‌డ్డార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ శుక్ర‌వారం రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో తానొక‌టి త‌లిస్తే అన్న చంద‌గా అయ్యింది.

అస‌లే ఆ సినిమాకి టైటిల్ కార్డ్స్ లో త‌న పేరు ``స‌మ‌ర్ప‌కుడు- స్క్రీన్ ప్లే డైలాగ్ ర‌చ‌యిత‌- ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌`` అంటూ ఘ‌నంగా ప‌డింది. పైగా దానిపై బోలెడంత ప్రీప‌బ్లిసిటీ జ‌రిగిపోయింది. తీరా రిజ‌ల్ట్ చూశాక ఖంగు తినాల్సి వ‌చ్చింది. పెట్టుబ‌డులు పోయినా క‌నీసం త‌న పేరు ప‌రువు మ‌ర్యాద అయినా నిల‌బెడుతుంద‌నుకుంటే ఇంకేదో అయ్యింది. ఓ హిట్టు కొట్టిన ద‌ర్శ‌కుడే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ చిత్రం వ‌ల్ల త‌న‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఊహించ‌ని ఈ ఒత్తిడి వ‌ల్ల ప్ర‌స్తుతం సెట్స్ పై డైరెక్ష‌న్ లో ఉన్న త‌న‌ సినిమా కొద్దిరోజుల పాటు వెన‌క్కి తోయాల్సి వ‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం ఇంకా ఆ ఫ్లాప్ మూవీని ప్ర‌మోట్ చేసేందుకు షెడ్యూళ్ల‌ను వేయాల్సొచ్చింద‌ట‌. అయినా అన‌వ‌స‌రంగా ఇలాంటివి నెత్తిన వేసుకుంటే లేనిపోని త‌ల‌నొప్పి అని ఇప్ప‌టికైనా అర్థ‌మైంది. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డే ఛాన్సుంటుంది అంటూ ఫిలింన‌గ‌ర్ ఇన్ సైడ్ గుస‌గుసా వేడెక్కిస్తోంది.