Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆమె ఇన్ వోర్ బ్రాండ్ సీకే కాదుగా

By:  Tupaki Desk   |   7 Feb 2021 9:00 AM IST
ఫోటో స్టోరి: ఆమె ఇన్ వోర్ బ్రాండ్ సీకే కాదుగా
X
బాలీవుడ్ టాలీవుడ్ లో ఐటెమ్ గాళ్ గా సుప‌రిచితం స్కార్లెట్ విల్స‌న్. ఈ విదేశీ ముద్దుగుమ్మ అంద‌చందాలు నృత్య భంగిమ‌ల‌తో మ‌త్తు చ‌ల్లే వైనం ప్ర‌త్యేకించి బోయ్స్ లో చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది.

సోష‌ల్ మీడియాలోనూ నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు జిమ్ వీడియోతో ఇంకా ట‌చ్ లో ఉంది. ఆయిలీ వెట్ లుక్.. లేదా తేనె లో త‌డిసి ముద్దువుతున్న‌ స్కార్లెట్ ఫోటోలు ఇంత‌కుముందు కుర్ర‌కారులో హాట్ టాపిక్ గా మారాయి.

బాహుబ‌లి మ‌నోహ‌రి సాంగ్ లో ఇద్ద‌రు హాటెస్ట్ ఐటెమ్ భామ‌ల‌కు ధీటుగా స్కార్లెట్ మూడో భామ‌గా అందాలు ఆర‌బోసింది. స్కార్లెట్ నృత్యాలు భంగిమ‌లు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని వేడెక్కించాయి.

అక్ష‌య్ కుమార్ గోల్డ్ లోనూ స్కార్లెట్ మెరుపులు మెరిపించింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఓ యువ‌కుడిని చెంప దెబ్బ కొట్టి హాట్ టాపిక్ గా మారింది. ఇక 2020లో సంతానం నటించిన త‌మిళ సినిమా ది ఝ‌ల‌క్ దిక్ లాజా రీలోడెడ్ లో `ద‌గాల్టీ` స్పెష‌ల్ సాంగ్ లో న‌ర్తించి మెరుపులు మెరిపించింది. ఇందులో ఇమ్రాన్ హ‌ష్మి తో రొమాన్స్ చేయ‌గా ర‌ణ‌బీర్ తండ్రి రిషీజీ స్పెష‌ల్ ఎంట్రీ ఆక‌ట్టుకుంది. అలాగే 2019లో హ‌మ్ తుమ్ సే ప్యార్ కిత్నా అనే వీడియో.. ది బాడీ అనే వీడియో సాంగ్ లోనూ స్కార్లెట్ అద్భుత న‌ర్త‌న‌ల‌తో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌లు వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తోందిట‌. తాజాగా మ‌రోసారి ఇన్ స్టాలో స్కార్లెట్ హాటెస్ట్ ఫోటో వైర‌ల్ గా మారింది.

స్కార్లెట్ బ్యాక్ గ్రౌండ్ ప‌రిశీలిస్తే.. త‌ను బ్రిట‌న్ బ్యూటీ. యూకే కెంట్ లోని ఫోక్స్ ట‌న్ ‌లో పెరిగింది. ఆమె తల్లి రోసలింద్ ఒక నర్తకి .. స్కార్లెట్ నడవగలిగే ఏజ్ లోనే న‌ర్త‌కిగా వృత్తిని ప్రారంభించింది. అనంత‌రం బాల న‌టిగా 13 వయస్సులో స్టేజీ డ్రామాల్లో న‌టించింది. 16 సంవత్సరాల వయస్సులో స్కార్లెట్ టిఫనీ థియేటర్ కాలేజీలో చదివింది. అక్కడ ఆమె 3 సంవత్సరాల పాటు ప్రదర్శన కళలలో వృత్తిపరంగా శిక్షణ పొందింది. కళాశాల తరువాత స్కార్లెట్ ‌కు భారతదేశంలో మోడలింగ్ కాంట్రాక్ట్ అవ‌కాశం ద‌క్కింది. అటుపై టిబా రేగా దిబాకర్ బెనర్జీ `షాంఘై`లో తొలి హాలీవుడ్ ఆఫ‌ర్ ద‌క్కింది. నటన మోడలింగ్ ప‌రంగా భారతదేశం ఇంగ్లాండ్ లో బిజీ అయ్యింది.