Begin typing your search above and press return to search.

ప్లేబోయ్ క‌వ‌ర్ అయినా చిన‌గాలేమో!

By:  Tupaki Desk   |   16 March 2020 2:30 AM GMT
ప్లేబోయ్ క‌వ‌ర్ అయినా చిన‌గాలేమో!
X
సోనాలి రౌత్ కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ గాళ్ గా సుప‌రిచితం. భారతీయ మోడల్ కం నటి. 2010 లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనిపించిన ఈ బ్యూటీ రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం `ది ఎక్స్‌పోస్` తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2014 లో హిమేష్ రేషమ్మీయా- యోయో హనీ సింగ్ సరసన ఈ అమ్మ‌డు న‌టించింది. రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ 8 లో ఈ అమ్మ‌డి ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ సూపర్ మోడల్ ఉజ్జ్వాలా రౌత్ యొక్క చెల్లెలు. ఆమె తండ్రి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కావ‌డంతో సంఘంలో బోలెడంత గుర్తింపు ఉంఇ.

ఆరంభ‌మే `ది ఎక్స్‌పోజ్‌` లో హత్యకు గురైన సినీ నటి పాత్రలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ త‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా స్వాగతించలేదు అని నిరాశ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. అటుపై రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఇంటిలో ప్ర‌వేశించింది. కన్నడ చిత్ర దర్శకుడు ఎస్. కె.బ‌షీద్ `99% యూజ్ లెస్ ఫెలోస్` అనే చిత్రానికి కమిటై అటుపై అర్థాంత‌రంగా వైదొల‌గ‌డంతో వివాదాల్లోకి వ‌చ్చింది. త‌న‌కు క‌మిట్ మెంట్ లేద‌ని బ‌షీద్ మీడియా ముందు చిర్రుబుర్రులాడారు. అటుపై రౌత్ బిగ్ బాస్ 8 లో హ‌డావుడి చేసింది.

2016 లో రౌత్ గ్రేట్ గ్రాండ్ మ‌స్తి చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె షైనీ అనే పాత్ర‌లో నటించింది. `లిప్ స్టిక్ లగా కే` చిత్రం పాటలో న‌ర్తించింది. ఇక‌పోతే రౌత్ కి ఇటీవ‌ల అస‌లు అవ‌కాశాల‌న్న‌వే లేవు. దీంతో ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాల్లో అర్థ‌న‌గ్న ఫోటోల‌తో చెల‌రేగుతోంది. షెర్లిన్ చోప్రా త‌ర్వాత ఈ అమ్మ‌డే అన్నంత‌గా రెచ్చిపోతున్నందుకైనా పిలిచి ఓ ఐటెమ్ నంబ‌ర్ లో ఛాన్సివ్వ‌రేమిటో!