Begin typing your search above and press return to search.

రష్మిక మనసు దోచుకున్న చిన్నారి శ్రీవల్లి..!

By:  Tupaki Desk   |   14 Sep 2022 12:25 PM GMT
రష్మిక మనసు దోచుకున్న చిన్నారి శ్రీవల్లి..!
X
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో హీరో మేనరిజం - డైలాగ్స్ మరియు పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది.

సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ సినిమాలోని పాటలకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ - కవర్ సాంగ్స్ చేస్తూ నెట్టింట సందడి చేశారు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని 'సామీ సామీ' అనే పాట చిన్న పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికీ బాగా కనెక్ట్ అయింది.

'నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ..' అంటూ సాగిన ఈ ఫోక్ నంబర్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేసాడు. చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. మౌనిక యాదవ్ పాడింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

'సామీ సామీ' పాటకు తెలుగులోనే కాకుండా.. మిగతా అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రష్మిక - బన్నీ లను ఇమిటేట్ చేస్తూ అనేకమంది యువతీ యువకులు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు.

తాజాగా ఈ 'సామి నా సామి' పాటకు ఓ చిన్నారి స్టెప్పులు వేసి ఆశ్చర్య పరిచింది. ఆ పాట హిందీ వెర్షన్ కు స్కూల్ డ్రెస్ లో పాప వేసిన డ్యాన్స్ మూవ్స్ మరియు హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో.. అది హీరోయిన్ రష్మిక వరకూ చేరింది.

చిన్నారి సిగ్నేచర్ స్టెప్పులు రష్మిక కు తెగ నచ్చేసాయి. ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఆమెను కలవాలనుకుంటున్నాను.. ఎలా కలవాలో చెప్పాలంటూ ట్వీట్ చేసింది. ''మేడ్ మై డే.. నేను ఈ క్యూటీని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను.. ఎలా?'' అని రష్నిక పేర్కొంది.

దీనిపై తమిళ దర్శక నటుడు ఎస్ జె సూర్య కూడా స్పందించారు. ''లవ్ యూ బేబీ.. క్యూట్ క్యూట్'' అంటూ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా లను ట్యాగ్ చేసాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'చిన్నారి శ్రీవల్లి' అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 'పుష్ప' మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పుడు 'పుష్ప 2' ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు. ఈ భాగాన్ని 'పుష్ప: ది రూల్' పేరుతో తెరకెక్కించనున్నారు. రష్మిక ఇందులోనూ హీరోయిన్ గా కొనసాగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.