Begin typing your search above and press return to search.

చెంపచెల్లుమనిపించిన ‘బాహుబలి’ భామ

By:  Tupaki Desk   |   1 Aug 2017 12:00 PM GMT
చెంపచెల్లుమనిపించిన ‘బాహుబలి’ భామ
X
‘బాహుబలి: ది బిగినింగ్’లో మనోహరి పాటలో తళుక్కుమన్న బ్రిటిష్ బ్యూటీ స్కార్లెట్ విల్సన్ గుర్తుంది కదా. ‘కెమెరామన్ గంగతో రాంబాబు’.. ‘ఎవడు’ లాంటి సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్ చేసిన ఈ భామ.. ఓ కాంట్రవర్శీతో వార్తల్లోకి వచ్చింది. ‘హంస: ఏక్ సంయోగ్’ అనే హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా తనతో అనుచితంగా ప్రవర్తించిన నటుడిని ఆమె చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. బాలీవుడ్లో ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే అయినట్లు తెలుస్తోంది.

‘హంసా: ఏక్ సంయోగ్’ సినిమాలో స్కార్లెట్ ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. షూటింగ్ కోసం వెళ్లగా ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉమాకాంత్ రాయ్ అనే నటుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడు. అసభ్యకరమైన సంజ్ణలు చేయడమే కాక.. ఓ దశలో ఆమెను ఇబ్బందికర రీతిలో టచ్ చేసే ప్రయత్నం కూడా చేశాడట. దీంతో స్కార్లెట్ సహనం కోల్పోయి అతడి చెంప చెల్లుమనిపించేసిందట. యూనిట్లోని వాళ్లకు కూడా విషయం అర్థమై అతడికి దేహశుద్ధి చేసినట్లు తెలిసింది.

‘హంసా: ఏక్ సంయోగ్’ చిత్ర యూనిట్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఉమాకాంత్ ను సినిమా నుంచి బయటికి పంపేసినట్లు తెలిపాయి. అతడిపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేసినట్లు నిర్మాత వెల్లడించాడు. స్కార్లెట్ కు అతను బేషరతుగా క్షమాపణలు చెప్పని పక్షంలో నటుడిగా అతడి లైసెన్స్ రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేస్తామన్నాడు. ఈ వ్యవహారంపై స్కార్లెట్ ఇప్పటిదాకా పెదవి విప్పలేదు.