Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జిల్ అనిపిస్తున్న అందం

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:54 AM GMT
ఫోటో స్టోరి: జిల్ అనిపిస్తున్న అందం
X
ఐటెమ్ సాంగ్స్ లా కిక్కు ఏమిటో గాని ఆ తరహా సాంగ్స్ ఎవ్వరు చేసినా ఈ మధ్య తెగ పాపులర్ అవుతున్నారు. మొన్నటి వరకు వాటికోసం ప్రత్యేకంగా ఉన్న కొంత మంది భామలు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఎక్కువగా హీరోయిన్స్ కూడా ఐటెమ్ సాంగ్స్ ని చేస్తున్నారు. అలాగే యాంకర్స్ కూడా ఆ సైడ్ లో అడుగులు వేస్తున్నారు. ఇక విదేశీ భామల డామినేషన్ కూడా ఎక్కువైపోయింది.

ఎక్కువగా విదేశీ భామలు ఈ మధ్య కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తూ చాలా ఫేమస్ అవుతున్నారు. ఆ తరహాలో స్పెషల్ సాంగ్స్ ని చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోడల్ స్కార్లెట్ విల్సన్. ఈ బ్రిటిష్ పాప హాట్ అందాలు సౌత్ లొనే కాకుండా నార్త్ లోను ఛాలా సక్సెస్ అయ్యాయి. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా తన డ్యాన్సుతో ఆదరగొట్టేసింది.

అయితే ఈ ఇంగ్లీష్ భామకు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ చాలానే ఉన్నారు. మోడల్ కావడంతో బికినీ లుక్ లో స్టిల్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్ అనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా స్కార్లెట్ ఇచ్చిన ఒక స్టిల్ చూస్తే ఎంతటి వారికైనా హార్ట్ బీట్ లో తేడా రావొచ్చేమో.. అమ్మడు ఎల్లో బికినీ లో వయ్యారాలు వలకబోస్తూ కత్తి లాంటి చూపులతో కవ్విస్తోంది. మొత్తంగా ఫొటో చూస్తుంటే ఒక్కసారిగా జిల్ అనే ఫీలింగ్ తెప్పిస్తోంది.