Begin typing your search above and press return to search.

కార్తి మూవీలో మురిపిస్తున్న పవన్ ఐటెం

By:  Tupaki Desk   |   14 April 2017 4:57 AM GMT
కార్తి మూవీలో మురిపిస్తున్న పవన్ ఐటెం
X
ఇంగ్లాండ్ భామ స్కార్లెట్ మెలిష్ విల్సన్.. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీతో సౌత్ లో అడుగుపెట్టింది. పవన్ పక్కన మెరిసిన మహత్యంతో.. వరుస ఆఫర్లు దక్కించేసుకున్న స్కార్లెట్.. బాహుబలి ది బిగినింగ్ లో కూడా ఐటెం సాంగ్ చేసే ఆఫర్ పట్టేసింది. అంతే కాదు.. రామ్ చరణ్ మూవీ ఎవడులో 'అయ్యో పాపం' అంటూ అలరించిన అనుభవం కూడా ఉంది.

ఇలయ దళపతి విజయ్ మూవీ జిల్లాలో కూడా మెరిసిన స్కార్లెట్ విల్సన్.. ఇప్పుడు కార్తి హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. స్కార్లెట్ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ బ్రిటిష్ భామ నటిస్తున్న సాంగ్ పిక్చరైజ్ చేస్తుండగా.. రాజస్థాన్ లోని జైసల్మీర్ కోటలో షూటింగ్ జరుగుతోంది. గిబ్రాన్ అందించిన సూపర్బ్ బీట్ కు ఆడిపాడుతున్న స్కార్లెట్.. తొలిసారిగా ఓ అందమైన కోటలో షూటింగ్ చేస్తున్నందుకు తెగ సంతోషంగా ఉన్నానని చెబుతోంది.

ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్న బృందపై ప్రశంసల వర్షం కురిపించిన స్కార్లెట్.. 'ఈ మహిళ నాకు చాలా నచ్చేసింది. ఇలాంటి కొరియోగ్రాఫర్ తో వర్క్ చేయడం నా అదృష్టం' అనేసింది. ధీరన్ అధిగారం ఒండ్రు పేరుతో తెరకెక్కుతున్ ఈ చిత్రానికి.. చతురంగ వేట్టైం ఫేం హెచ్. వినోద్ దర్శకుడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/