Begin typing your search above and press return to search.

ఈవిడ చైతన్య ద్వారా వచ్చిందా...

By:  Tupaki Desk   |   12 April 2015 1:30 AM GMT
ఈవిడ చైతన్య ద్వారా వచ్చిందా...
X
అమ్మడి పేరు స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్‌. బ్రిటన్‌ నుండి మన దేశానికి ఇంపోర్ట్‌ అయిన మరో మాట్‌ మోడల్‌. ఈమె కూడా టాలీవుడ్‌లో పాగా వేయాలనే చూస్తోంది. అందుకే ఇప్పుడు వరుసపెట్టి తెలుగులో ఐటెం సాంగుల తెగ చేసేస్తోంది. ఇకపోతే ఈమె గురించి ఓ విషయం చెప్పాలి మీకు..

అప్పట్లో రామ్‌చరణ్‌తో ఎవడు సినిమాలో ఒక ఐటెం సాంగ్‌ చేసిన స్కార్లెట్‌ మెలిష్‌. ఆ పాటను సినిమా రిలీజ్‌ అవ్వడానికి దాదాపు ఓ సంవత్సరం ముందే షూట్‌ చేశారు. ఆ పాటను చూసిన పూరి జగన్‌ ఈమెకు కెమెరామ్యాన్‌ గంగతో రాంబాబు సినిమాలో ఒక ఐటెం సాంగ్‌ చేయడానికి ఛాన్సిచ్చాడు. ఆ తరువాత ఇప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్‌తో ఒక పాటలో మెరిసింది అమ్మడు. ఏకంగా 8 రోజులు షూటింగ్‌ చేసింది. అయితే ఈ అమ్మడు ఈ సినిమాలకంటే ముందే తెలుగులో ఓ సినిమా చేసింది.

అప్పట్లో ''దడ'' సినిమాలో బ్రహ్మానందం ఇంట్రోడక్షన్‌ సీన్‌లో.. అతని వళ్ళో కూర్చొని మాట్లాడే ఓ గాళ్‌ ఫ్రెండ్‌ పాత్రలో నటించింది స్కార్లెట్‌ మెలిష్‌ విల్సన్‌. అయితే అప్పట్లో ఆ సినిమా దారుణమైన ఫ్లాపు కావడంతో, అస్సలు ఆ చిన్న పాత్ర ఎవ్వరికీ గుర్తులేదు. అది మ్యాటరు.