Begin typing your search above and press return to search.

అయ్యో పాపం బీచ్‌ లో తేలింది

By:  Tupaki Desk   |   28 Feb 2018 12:18 PM GMT
అయ్యో పాపం బీచ్‌ లో తేలింది
X

స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ అంటే టక్కుమని గుర్తుకు రాకపోవచ్చేమో కానీ.. ఎవడు సినిమాలో అయ్యో పాపం అంటూ పాడిన భామ అంటే మాత్రం టక్కుమని గుర్తుకొచ్చేయడం ఖాయం. కెమేరామెన్ గంగతో రాంబాబు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో కూడా ఐటెం సాంగ్ లో కనిపించింది.

ఇప్పుడీ బ్యూటీ ఫ్లోరిడా బీచ్ లో తేలింది. అక్కడి నుంచి మాంచి మాంచి హాట్ ఫోటోలను నెట్ లో షేర్ చేస్తూ.. అభిమానుల్లో వేడి పెంచేస్తోంది. వెకేషన్ ను ఎంజాయ్ చేయడం అంటే ఏమేం చేయాలో అర్ధం చెప్పేస్తోంది స్కార్లెట్ విల్సన్. బీచ్ లో ఎన్నిరకాల సరాగాలు ఆడచ్చో అన్నీ పూర్తి చేసి.. ఆనక తీరిగ్గా కమర్షియల్ యాంగిల్ కూడా స్టార్ట్ చేసేసింది. అదేనండీ.. పెయిడ్ పోస్టులు ఉంటాయి కదా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఆ బ్రాండ్లను పొగిడి డబ్బులు చేసుకోవడం అనే స్కీమ్ ని బాగానే పాటించేస్తోంది. కాకపోతే ఉట్టినే పోస్టులు పెడితే ఇంట్రెస్ట్ ఉండదు కదా.. అందుకే అందాల ప్రదర్శనతో వీటిని రంగరించి.. బ్రాండింగ్ చేసుకుంటోంది.

ఇంగ్లండ్ నుంచి వచ్చి ఇక్కడ ఐటెం సాంగులు చేసి ఇమేజ్ తో పాటు డబ్బులు కూడా బాగానే చేసుకున్న ఈ భామ.. ఇండియన్ తోనే తన పెళ్లి తంతు కూడా పూర్తి చేసేసుకుంది. హిందీ టీవీ యాక్టర్ ప్రవేష్ రానాను రెండేళ్ల క్రితమే పెళ్లాడినా.. యాక్టింగ్ లో మాత్రం సత్తా చాటుతానంటోంది స్కార్లెట్ విల్సన్.