Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ పక్కనంటే హడలిపోతున్నారట..

By:  Tupaki Desk   |   28 July 2018 5:46 AM GMT
ఈ హీరోయిన్ పక్కనంటే హడలిపోతున్నారట..
X

సాయేషా సైగల్.. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం వరుస హిట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. వనమగన్ చిత్రం ద్వారా సైగల్ తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

సాయేషా సైగల్ మంచి డ్యాన్సర్. కథక్ - ఒడిస్సీ - లాటిన్ - అమెరికన్ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. ఎవరూ ఊహించని స్పీడుతో డ్యాన్స్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆమెతో కలిసి డ్యాన్స్ చేయమంటే హీరోలు బెంబేలెత్తిపోతున్నారట.. అంతలా ఊపేసే సైగల్ సినిమాలు లేని సమయాన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటానని తెలిపింది.

తెలుగు - హిందీ - తమిళ చిత్రాల్లో నటించానని.. ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలోనే తమిళం నేర్చుకుంటున్నానని తెలిపింది. ట్రావెలింగ్ - స్విమ్మింగ్ అంటే ఇష్టమని.. నటిని అయినప్పటికీ తన జీవితంలో పెద్ద మార్పులేదని సాయేషా చెప్పుకొచ్చింది.