Begin typing your search above and press return to search.

సన్ టీవీ యజమానిని .. జయలలిత మేనల్లుడిని అంటూ!!

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
సన్ టీవీ యజమానిని .. జయలలిత మేనల్లుడిని అంటూ!!
X
అక్ర‌మార్జ‌న .. మనీలాండరింగ్ కేసులో కాన్ మ‌న్ సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ లో చేర్చింది.

జాక్విలిన్ తాను బలంగా ఉన్నానని ఒక రహస్య సందేశాన్ని షేర్ చేసింది. ఈరోజు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది త‌న క్లైంట్ `కుట్ర`లో ఇరుక్కుంది అని పేర్కొన్నారు. సన్ టీవీ యజమానిని ..జయలలిత మేనల్లుడిని అని సుఖేష్ చంద్రశేఖర్ తనను తాను పరిచయం చేసుకున్నాడని జాక్వెలిన్ ఈడీకి ముఖాముఖిగా వెల్ల‌డించింది.

జాక్విలిన్ అందించిన‌ వివ‌రాల‌ ప్రకారం.. ఆ ఇద్దరూ చెన్నైలో రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారని.. ఆరు నెలలుగా ఫోన్ లో ఎక్కువగా టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2021 నుండి ఆగస్టు 2021 వరకు తాము టెలిఫోన్ లో మాట్లాడామని.. సుఖేష్ వెర్షన్ కూడా ఇదే తేదీలను పేర్కొన్నట్లు జాక్వెలిన్ చెప్పారు. మోస‌పూరిత మాట‌ల‌తో రాన్ బాక్సీ మాజీ యజమాని భార్య అదితి సింగ్- శివిందర్ సింగ్ ల నుంచి 215 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడినందుకు సుకేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది.

తనపై దోపిడీ కేసు నమోదు చేసిన తర్వాత జాక్విలిన్ ఇంత‌కుముందే ఒక నిగూఢ‌మైన పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో బలంగా ఉండటం.. లక్ష్యాలను సాధించడం గురించి త‌న క‌ల‌ల్ని వెల్ల‌డించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా లో త‌న మ‌న‌సులో ఉన్న ర‌హ‌స్యాన్ని ఎంతో క్రిప్టిక్ గా బ‌య‌ట‌పెట్టారు. ఈ పోస్ట్ తో త‌న ఫాలోవ‌ర్స్ దృష్టిని ఆకర్షించింది. `ప్రియమైన నాకు` అని సంబోధిస్తూ ఒక నోట్ ను షేర్ చేసింది. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో కాన్ మాన్ గా పాపుల‌రైన‌ సుకేష్ చంద్రశేఖర్ తో వ్య‌వ‌హారంలో జాక్విలిన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో జాకీ క్రిప్టిక్ పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆ నిగూఢ‌మైన‌ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ``ప్రియమైన నాకు.. నేను అన్ని మంచి ప‌నుల‌కు అర్హురాలిని. నేను శక్తివంతురాలిని.. నన్ను నేను అంగీకరిస్తున్నాను.. అంతా ఓకే అవుతుంది. నేను బలంగా ఉన్నాను.. నేను నా లక్ష్యాలను సాధిస్తాను..కలలను నిజం చేస్తాను..``అని నోట్ లో రాసింది జాకీ. అంతకుముందు రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ ను సమర్పించింది. అందులో వారు సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితులలో ఒకరిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను పేర్కొన్నారు. అంతేకాకుండా మనీ ట్రయల్ ను క్షుణ్ణంగా విచారించిన తర్వాత జాక్విలిన్ పేరును చేర్చినట్లు కూడా ఛార్జిషీట్ పేర్కొంది.