Begin typing your search above and press return to search.

అఖిల్‌ హీరోయిన్‌ సూపర్‌ లౌక్యం

By:  Tupaki Desk   |   11 Aug 2015 12:22 PM GMT
అఖిల్‌ హీరోయిన్‌ సూపర్‌ లౌక్యం
X
కూచిపూడి - ఒడిస్సా - సాల్సా - రుంబా ఇన్ని రకాల డ్యాన్సులున్నాయని మనకేం తెలుసు. కానీ అఖిల్‌ హీరోయిన్‌ కి బాగా తెలుసు. సయేషా సైగల్‌ .. ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగిపోతున్న పేరు. ఈ భామకు రకరకాల డ్యాన్సింగ్‌ స్టయిల్స్‌ తెలుసు. అందుకే ఆన్‌ సెట్స్‌ అఖిల్‌ కి పోటీగా డ్యాన్సులు ఇరగదీస్తోందని టాక్‌ వచ్చింది. వెస్ట్రన్‌, లోకల్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల డ్యాన్సుల్లోనూ ప్రతిభ చూపిస్తోంది అమ్మడు.

సయేషా ఇప్పుడిప్పుడే తెలుగు కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం తన దర్శకుడు వినాయక్‌ చెప్పిన తెలుగు పదాల్ని నేర్చేసుకుంటోంది. నాకు అర్థం అయ్యింది.. అంటూ కిసుక్కున నవ్వేస్తోంది అమ్మడు. అన్నట్టు సయేషా బ్యాక్‌ గ్రౌండ్‌ చెప్పుకోదగ్గది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో దిలీప్‌ కుమార్‌, సైరాభాను జంట వారసత్వంగా పరిశ్రమలో అడుగుపెట్టింది. అఖిల్‌ సరసన నాయికగా ఎంపికవ్వగానే మరో శుభవార్త కూడా చెప్పింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న తాజా చిత్రంలో ఈ అమ్మడినే నాయికగా ఎంచుకున్నారు. ఈ సంగతిని సయేషా స్వయంగా చెప్పింది.

అజయ్‌ చాలా ఓపిక ఉన్న స్టార్‌. అతడితో కలిసి పనిచేయడం నా అదృష్టం అని చెప్పింది. లండన్‌ లో స్కూలింగ్‌ చేశాను. ముంబై లో యాక్టింగుకి సంబంధించి బోలెడన్ని విషయాలు తెలుసుకున్నా. తాతయ్య, గ్రాండ్‌ మాల అనుమతితోనే నటి అయ్యానని చెప్పింది. నాకు హిందీ సినిమా ఎలానో, తెలుగు సినిమా కూడా అలానే. తరతమ భేధాలేవీ లేవని గుచ్చి గుచ్చి చెప్పింది. ఇప్పట్నుంచే సయేషా చాలా లౌక్యం ప్రదర్శిస్తోంది కదూ?