Begin typing your search above and press return to search.

నేను ఊహించనిది, నన్ను వెంటాడింది

By:  Tupaki Desk   |   23 July 2015 12:21 PM GMT
నేను ఊహించనిది, నన్ను వెంటాడింది
X
అక్కినేని అఖిల్‌ డెబ్యూ సినిమాలో కథానాయికగా ఆరంగేట్రం చేస్తోంది సయేషా సైగల్‌. గ్రీకు సుందరికి జెరాక్స్‌ కాపీలా ఉందని ప్రశంసలు అందుకుంది. అఖిల్‌ కి సరిజోడు అంటూ పొగిడేశారంతా. ఈ భామ బాలీవుడ్‌ మేటి నాయిక సైరాభాను మనవసరాలు. సైరాభానును మించిన అందగత్తెగా పేరు తెచ్చుకుంటోంది. అయితే సయేషా తన ఆరంగేట్రం గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని చెప్పింది..

=అఖిల్‌ సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం. వి.వి.వినాయక్‌ అండ్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బృందం నా ఫోటోలు చూసి ముంబై వచ్చి కలిశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే హైదరాబాద్‌ లో వాలిపోయాను. ఇక అక్కడి నుంచి మీకు తెలిసిందే.

=తెలుగులో ఈ రేంజు ఎంట్రీ దక్కడం నా అదృష్టం. ఇదో చక్కని లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అన్ని వాణిజ్య హంగుల్ని దర్శకుడు సమకూర్చి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ పూర్తయింది. బ్యాలెన్స్‌ చిత్రీకరణకు రెడీ అవుతున్నాం. నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29న ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయనున్నారు.

= నా తొలి సినిమా సెట్స్‌ లో ఉండగానే బాలీవుడ్‌ లో నటించే అవకాశం వచ్చింది. అజయ్‌ దేవగన్‌ డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇస్తున్న 'శివయ్య' చిత్రంలో ఛాన్సొచ్చింది. వాస్తవానికి అజయ్‌ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. దర్శకుడిగా డెబ్యూ సినిమాకి నన్ను ఎంచుకోవడాన్ని గొప్పగా ఫీలవుతున్నా. వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలవుతుంది. అఖిల్‌, అజయ్‌ లతో ఎంట్రీలు ఊహించనివి. అవి నన్ను వెంబడించి వచ్చాయి.

= అఖిల్‌ తో ఆరంగేట్రం నాకు కలిసొచ్చేదే. ఈ చిత్రం సౌత్‌ లో అన్ని భాషల్లోనూ నా ఎంట్రీకి ఉపకరిస్తుంది. అలాగే నా ఫేవరెట్‌ డైరెక్టర్‌ మణిరత్నంతో కలిసి పనిచేయాలనుంది.

=అఖిల్‌ ఫెంటాస్టిక్‌ కోస్టార్‌. అతడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నేను, అఖిల్‌ ఇద్దరికీ కెమెరా కొత్తే. కాబట్టి ఒకరికొకరం సహకరించుకున్నాం. అలాగే తెలుగుతో ఆరంభంలో కాస్త ఇబ్బంది అనిపించినా, నెమ్మదిగా సర్ధుకుపోయాను.

=కథక్‌, ఒడిస్సీ, జుంబా (లాటిన్‌ స్టయిల్‌ డ్యాన్సులు), చాచా, జైవ్‌ వంటి నృత్యాల్లో ప్రావీణ్యం ఉంది. 10ఏళ్ల వయసప్పట్నుంచి నటన, డ్యాన్సుల్లో శిక్షణ పొందుతున్నా.