Begin typing your search above and press return to search.

అఖిల్‌ హీరోయిన్‌.. ఘటికురాలే..

By:  Tupaki Desk   |   20 Sep 2015 5:07 PM GMT
అఖిల్‌ హీరోయిన్‌.. ఘటికురాలే..
X
స్టేజీ మీద డ్యాన్సు వేయమ్మా అంటే మరో హీరోయిన్‌ అయితే తడబడేదేమో.. కాని బాలీవుడ్‌ నుండి వచ్చిన సయేషా సైగల్‌ మాత్రం తన దమ్ము చూపించేసింది. అసలు యాంకర్‌ సుమ పిలిచి స్టేజీ మీద ఒక స్టెప్‌ వేయమని చెప్పగానే.. వెంటనే సై అనేసింది సయేషా. అంతేకాదు.. తన పార్టనర్‌ అఖిల్‌ ఉంటే ఇంకా బాగా వేస్తానని చెప్పింది. చివరకు అఖిల్‌ హ్యాండిచ్చినా కూడా ఆమె ఓ నిమిషం పాటు స్టేజీని ఊపేసిందంతే. మామూలుగా ఇంకో హీరోయిన్‌ కు అంత గట్స్‌ ఉండేవి కాదు.. కాని సయేషా మాత్రం తొలి సినిమాతో ఏదో చేయబోతోందని అర్ధమవుతోంది.

అంతేకాదు.. తెలుగులో గలగలా మాట్టాడేస్తున్న సయేషా.. నేను వినాయక్‌ సార్‌ దగ్గరే తెలుగు నేర్చుకున్నా అంటోంది సయేషా. ఆయన్ని మర్చిపోలేను, నాకు గాడ్‌ ఫాథర్‌ ఆయన అని కితాబిచ్చింది. ఇకపోతే అఖిల్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ కు ఎన్ని పాయింట్లు ఇస్తారు అంటే.. ''అందరూ బెస్ట్‌ ఇచ్చాం.. ఇక అఖిల్‌ ను రేట్‌ చేయమంటే మాత్రం కష్టం'' అని చెప్పింది. మొత్తానికి స్టార్‌ హీరోయిన్‌ ఎలా అవ్వాలో సయేషా కు బాగా తెలిసినట్టుందే. ప్రతీ సాంగ్‌ వీడియోలోనూ అఖిల్‌ తో పాటు సయేషా కూడా అదరగొట్టడం చూస్తే ఈమె ఘటికురాలే అనిపిస్తోంది. వెండితెరమీద కూడా కాస్త ప్రూవ్‌ చేసుకుంటే.. అటు సమంతలు, ఇటు రాశి ఖన్నాలూ కాస్త శృతి చేసుకోవాల్సిందే మరి.