Begin typing your search above and press return to search.

ఈ పిల్లను ఎక్కడో చూసినట్లుందే ?

By:  Tupaki Desk   |   11 Aug 2015 2:32 PM GMT
ఈ పిల్లను ఎక్కడో చూసినట్లుందే ?
X
అక్కినేని అఖిల్ మూవీ కొత్త స్టిల్స్ బైటకొచ్చాయి. అఖిల్ కి పెయిర్ గా సాయేషా సైగల్ నటిస్తోంది. అక్కినేని వారబ్బాయి ఫస్ట్ లుక్ తోనే ఇరగదీసేశాడు. మన్ముథుడికే కొడుకైన అఖిల్ పక్కన నటించే అమ్మాయంటే ఎలా ఉంటుందో అనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే తాజాగా విడుదలైన ఫోటోలను చూస్తే... అఖిల్ లుక్స్ సూపర్ గా ఉన్నా.. అమ్మడు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పక్కింటమ్మాయి అనే లుక్ కోసం ప్రయత్నించినట్లుగా కనిపించినా.. స్క్రీన్ ప్రెజెన్స్ సాధారణంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. చూసీ చూడగానే అద్భుతంగా ఉందని అనిపించేలా లేకపోవడంతో.. అక్కినేని అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు. ఇంకా టీనేజ్ లోనే సాయేషా.. చూడగానే కట్టిపడేసే లుక్స్ తో ఉంటుందనే భావించారు ఇన్నాళ్లు. ఇప్పుడు కామన్ ఫేస్ లా.. ఎక్కడో చూసినట్లుందే అనే ఫీలింగ్‌ వచ్చేయడంతో.. ఇక యాక్టింగ్ ట్యాలెంట్ ఒకటే సాయేషాని కాపాడాలి.

ఇకపోతే సమంత, కాజల్‌ వంటి హీరోయిన్లు కూడా ఫోటోషూట్ లో చూడగానే ఆనేయలేదులే. ఏదో ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ తో ప్రూవ్‌ చేసుకోగానే టాప్‌ పొజిషన్‌ కు ఎదిగిపోయారు. సో, సాయేషా కూడా అదే రూటును ఫాలో అవుతోంది మరి..