Begin typing your search above and press return to search.

ఓ మై గాడ్.. అఖిల్ బ్యూటీ అక్క‌డేం చేస్తోంది?

By:  Tupaki Desk   |   2 Sep 2019 1:30 AM GMT
ఓ మై గాడ్.. అఖిల్ బ్యూటీ అక్క‌డేం చేస్తోంది?
X
అక్కినేని అఖిల్ స‌ర‌సన క‌థానాయిక‌గా న‌టించింది స‌యేషా సైగ‌ల్. తొలి ప్ర‌య‌త్నం ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత త‌మిళంలో ల‌క్ చెక్ చేసుకుని అక్క‌డ విజ‌యం అందుకుంది. అటుపై ప‌లు క్రేజీ అవ‌కాశాల్ని అందుకుంది. అక్క‌డే యువ‌హీరో ఆర్య‌ను పెళ్లాడేసి లైఫ్ లో సెటిలైపోయిన సంగ‌తి తెలిసిందే. స‌యేషా న‌టించిన తాజా చిత్రం బందోబ‌స్త్ (కాప్పాన్) ఈనెల 20న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య‌తో స‌యేషా అదిరిపోయే రొమాన్స్ చేసింద‌ట‌.

అయితే అప్ప‌టికే పెళ్ల‌యిన‌ స‌యేషాతో అంత ఘాటైన‌ రొమాన్స్ చేయాల్సి రావ‌డంపై సూర్య కాస్తంత గిల్టీగానే ఫీల‌వుతున్నాన‌ని ఓ వేదిక‌పై అన‌డం ఆస‌క్తిక‌రం. అదంతా స‌రే.. ఈ సినిమాకి రిలీజ్ కి స‌రిగ్గా 20 రోజులు కూడా లేదు. అయినా టాలీవుడ్ లో స‌రైన ప్ర‌మోష‌నే లేక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే.. ఆ లోటు పూడ్చేందుకు చిత్ర‌బృందం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ఇక‌పై కోలీవుడ్.. టాలీవుడ్ లో ప్ర‌చార కార్య‌మాల్లో వేగం పెంచుతున్నార‌ని తెలుస్తోంది. ఈనెల రెండో వారంలో హైద‌రాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...` పాట స‌హా `చెరుకు ముక్కలాంటి..` గీతాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని జెమినీ చానెల్ ద‌క్కించుకుంది.

ఎలానూ సినిమా ప్ర‌చారంలో బిజీ కాబోతోంది కాబ‌ట్టి ఈలోగానే ఇదిగో ఖాళీ స‌మ‌యాన్ని ఇలా స్పెయిన్ ఇబిజ‌లోని ఎగ్జోటిక్ లొకేష‌న్స్ లో ఇలా సెల‌బ్రేట్ చేస్తోంది స‌యేషా. అయితే యాథృచ్ఛికంగానో లేక ప్రీప్లాన్డ్ గానో తెలీదు కానీ ఓవైపు ఇబిజలో అక్కినేని నాగార్జున బ‌ర్త్ డే సంద‌ర్భంగా అక్కినేని ఫ్యామిలీ అక్క‌డే సెల‌బ్రేష‌న్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అఖిల్ ఇన్విటేషన్ మేర‌కే ఈ ఈవెంట్ కి స‌యేషా అటెండ‌య్యిందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఎలానూ నాగ‌చైత‌న్య‌- స‌మంత జోడీ ఇబిజ‌లో ఉన్నారు ఆర్య‌-స‌యేషా జోడీ కూడా స‌రికొత్తగా సెకెండ్ హ‌నీమూన్ ఇబిజ‌లోనే ప్లాన్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ జంట అక్కినేని సెల‌బ్రేష‌న్స్ లో ఉన్న‌ట్టు ఫోటోలేవీ రిలీజ్ కాలేదు. అయితే ఇబిజలోని అందమైన బులుగు జిలుగు సాగ‌ర‌తీరంలో స‌యేషా ఇలా మోటార్ బోటింగ్ ని ఆస్వాధిస్తున్న ఫోటో మాత్రం క‌వ్విస్తోంది.