Begin typing your search above and press return to search.

గెట్ రెడీ.. రేపే ఫస్ట్ పంచ్

By:  Tupaki Desk   |   15 March 2018 3:01 AM GMT
గెట్ రెడీ.. రేపే ఫస్ట్ పంచ్
X
హీరోయిన్ సమంతతో పెళ్లికి ముందుగా నాగచైతన్య యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం యుద్ధం శరణం చేశాడు. సినిమాలో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నా కథ రొటీన్ అయిపోయేసరికి అదేమో బాక్సాఫీసును ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ దీని తరవాత కూడా యాక్షన్ జోనర్ లోనే మరో మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా తనకు డీసెంట్ హిట్ ఇచ్చిన ప్రేమమ్ ఫేం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా మొదలుపెట్టాడు.

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సవ్యసాచి మూవీలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉండేలా చందు మొండేటి మొదటి నుంచి పక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో నాగచైతన్య డేర్ డెవిల్ పాత్రలో కొన్ని ప్రత్యేక శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో తమిళ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా సవ్యసాచి తెరకెక్కుతోంది. ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈనెల 16నే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ఫస్ట్ పంచ్ పేరుతో దీనిపై రూపొందించిన పోస్టర్ కూడా సూపర్ గా ఉంది. రెండు చేతులు యుద్ధానికి దిగుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ తోనే ఈ మూవీలో యాక్షన్ కంటెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పకుండానే చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.