Begin typing your search above and press return to search.

ఫస్ట్ పంచ్: పది చేతులు అక్కినేని పంచ్

By:  Tupaki Desk   |   16 March 2018 5:06 AM
ఫస్ట్ పంచ్: పది చేతులు అక్కినేని పంచ్
X
కార్తకేయ మరియు ప్రేమమ్ వంటి సినిమాలతో తన సత్తా చాటిన దర్శకుడు చందు మొండేటి ఇప్పుడు 'సవ్యసాచి' సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సవ్యసాచి అంటే ఆంబీ డెక్ట్సరస్ అంటూ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇప్పుడు తన హీరో స్థాయి ఏంటో చెప్పడానికి ఫస్ట్ లుక్ ఎలియాస్ ఫస్ట్ పంచ్ తో వచ్చారు యునిట్. పదండి అదెలా ఉందో చూద్దాం.

నిజానికి చైతన్యకు ఓ ఐదు జతల చేతులను పెట్టేసి.. అక్కడే చాలా ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అక్కడున్న ప్రతీ చేతిపై ఒక కొత్తరకం టాటూ ఉంది. ముఖ్యంగా ఒక చేతిపైన ఒక చిన్నపిల్ల బొమ్మ.. మరో చేతిపైన అక్క అని రాసి ఉండడం.. అలాగే arthic అంటూ ఒక ప్రముఖ డిజె గురించిన టాటూ.. ఇవన్నీ సినిమా కథ గురించి కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో అక్కగా భూమిక ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా కుటుంభ కథ చుట్టూ తిరిగే ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అనుకోవచ్చు.

ఇక మాధవన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కొత్తమ్మాయ్ నిధి అగర్వాల్ హీరోయిన్గా తెరంగేట్రం చేస్తోంది. అలాగే బాహుబలి సినిమా తరువాత బయట సినిమాలకు పనిచేయనని చెప్పిన కీరవాణి ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు. ఫస్ట్ పంచ్ తో అదరగొట్టారు సరే.. మరి ఫస్ట్ టీజర్ ఎప్పుడు?