Begin typing your search above and press return to search.

సవ్యసాచి బ్యూటి రెచ్చిపోయింది చూశారా

By:  Tupaki Desk   |   28 May 2018 7:02 AM GMT
సవ్యసాచి బ్యూటి రెచ్చిపోయింది చూశారా
X

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా తారల జిమ్ వీడియోలు దర్శమిస్తున్నాయి. దేశమంతా ఫిట్ గా ఉండాలని నరేంద్ర మోడీ వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. ఛాలెంజ్ గా తీసుకొని చాలా మంది సెలబ్రేటీలు సోషల్ మీడియా ద్వారానే ఇతర సెలబ్రెటీలకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇక రీసెంట్ గా అక్కినేని హీరో నాగ చైతన్య తన హీరోయిన్ కు అదే తరహాలో ఛాలెంజ్ విసిరాడు. సవ్యసాచి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే చైతు విసిరిన ఛాలెంజ్ కు హీరోయిన్ నిధి తనదైన శైలిలో జిమ్ వర్కౌట్స్ చేసి ఆన్సర్ ఇచ్చింది. ఆమె కనిపించిన విధానం కూడా మాములుగా లేదు. బాడీ బిల్డర్స్ స్థాయిలో అధిక బరువును మోస్తూ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పైగా కొంచెం హాట్ వర్కౌట్స్ చేయడంతో కుర్రకారు ఆకర్షితులు అవుతున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో మున్నా మైకేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిధి టాలీవుడ్ లో సవ్యా సాచి తో ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు ఆ సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ చేయాలనీ అనుకుంటోంది. కానీ నిధి కనిపిస్తున్న తీరును చూస్తుంటే ముందే సినిమాకు క్రేజ్ అందేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.