Begin typing your search above and press return to search.
గుర్రంతో చలాకి సవారి - టీజర్ టాక్
By: Tupaki Desk | 6 July 2019 10:37 AM ISTనందు హీరోగా ప్రియాంక శర్మను హీరొయిన్ గా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం సవారి. కొద్దిరోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన టీం తాజాగా టీజర్ ని లాంచ్ చేసింది. లైట్ గా థీమ్ ని ఇందులో చూపించారు. అనగనగా బాద్షా అనే గుర్రం. దానికి అండగా తోడుగా స్నేహితుడిగా కాచుకునే ఉండే కాపరి రాజు(బాద్షా). అనుకోకుండా ఓ సందర్భంలో పెళ్లి నుంచి తప్పించుకుని వచ్చిన భాగి(ప్రియాంక శర్మ)తో నందుకి అతని గుర్రానికి స్నేహం ఏర్పడుతుంది.
మరోవైపు భాగి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పాటు కాళి అనే రౌడీ గ్యాంగ్ వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇక అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. నందుకి భాగికి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ కథకు గుర్రానికి సవారి మీద బ్రతికే రాజుకు రౌడీ గ్యాంగ్ తో క్లాష్ ఎందుకు వచ్చింది అనేదే కథలో కీలకమైన పాయింట్
బందం రేగడ్ అనే షార్ట్ ఫిలింని హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్ తో తీసి మెప్పించిన సాహిత్ మోత్కూరి డెబ్యు మూవీ ఇది. ఇందులో కూడా సాంకేతికంగా విలువలను పాటిస్తూనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. నందు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ రెగ్యులర్ హీరోలకు భిన్నంగా తీర్చిదిద్దారు.
ప్రియాంక శర్మ సైతం సహజంగా పాత్రకు తగ్గట్టు ఉంది. లైట్ గా కామెడీని టచ్ చేస్తూనే ఫీల్ ని క్యారీ చేసిన విధానం బాగుంది. మొనిష్ భూపతిరాజు ఛాయాగ్రహణం శేఖర్ చంద్ర సంగీతం దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టు ఎలివేట్ అయ్యాయి. మొత్తానికి సవారిలో ఏదో విషయం ఉందనే అభిప్రాయాన్ని కలిగించడంలో సవారి టీం సక్సెస్ అయ్యింది.